సాధారణంగా ప్రయాణంలో ఉన్నా కానీ, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ చమట పడుతుంది. అలాగే వేసవి కాలంలో కూడా చెమటలు పట్టడం సర్వసాధారణమైన విషయం. శరీరానికి చెమట పట్టడం మంచిదే. ఎందుకంటే ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి, శరీరంలో ఉండే వేడి తగ్గించడానికి చెమట పట్టడం చాలా ముఖ్యం. చమట పట్టడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు కూడా వస్తుంది. చెమట పట్టడం వల్ల లాభాలే కానీ నష్టాలు ఏమీ లేవు. బరువు, మానసిక స్థితి నిద్రపై సానుకూల ప్రభావం చూపుతుంది.
అయితే కొంత మందికి చెమట మరీ ఎక్కువగా పడుతుంది. అలాంటి వారు ఎక్కడికైనా వెళ్తే.. పూర్తిగా చమటతో తడిచిపోతారు. ఎలాంటి అనారోగ్యం, శారీరక శ్రమ, వేడి లేకుండా చెమటలు పట్టడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరంలోని చెమటను తొలగించే గ్రంథులు అతిగా పని చేయడం వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.
అలాగే ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా చెమటలు ఎక్కువగా పడతాయి. చర్మంపై బ్యాక్టీరియా కూడా చెమటతో కలవడం వల్ల కొందరిలో చెమట దుర్వాసన కూడా వస్తుంది. మోనోపాస్, హైపర్ హైడ్రోసిస్, జ్వరం, థైరాయిడ్, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నా చెమట ఎక్కువగా పడుతుంది. కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా చెమట అనేది ఎక్కువగా పడుతుంది. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించడం మేలు. ఎందుకంటే చెమట ద్వారా ఒంట్లోని నీరంతా బయటకు పోయి.. డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాగా చెమట ఎక్కువగా పట్టడానికి శరీరంలో పిత్త దోషం పెరగడం కూడా ఒక కారణం. దీన్ని బ్యాలెన్స్ చేస్తే.. అధిక చెమల సమస్య, దుర్వాసన, వేడిని తగ్గిస్తుంది. మరి ఈ అధిక చెమటను తగ్గించడానికి చిట్కాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
ధనియా వాటర్: ధనియాలను గ్రైండ్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే.. అధిక చెమట నుంచి ఉపశమనం పొందొచ్చు.
ఎండు ద్రాక్ష: అధిక చెమట నుంచి ఉపశమనం కలగాలంటే.. రోజూ పరగడుపు నానబెట్టిన 10 ఎండు ద్రాక్ష తినాలి.
వట్టివేరు నీరు: సాధారణ నీరు తాగే బదులు, రోజంతా వట్టివేరు నీరు తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీని కోసం, ఒక చెంచా వట్టివేరు పొడిని రెండు లీటర్ల నీటిలో 20 నిమిషాలు నాన బెట్టండి. ఆ తర్వాత ఫిల్టర్ చేసి ఆ నీళ్లు తాగాలి.
చందనం పేస్ట్: స్నానం చేసే ముందు చందనం పేస్ట్ రాసి.. 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే.. ఎలాంటి దుర్వాసన రాదు.
నల్ ప్రమాది పొడి: మీరు స్నానం చేసే 20 నిమిషాల ముందు నల్ ప్రమాది పొడిని నీటిలో వేసి.. తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే దుర్వాసన రాకుండా ఫ్రెష్ గా ఉంటుంది.
ఈ ఆహారాలను తినకూడదు: చమట తక్కువగా పట్టాలంటే.. శరీరానికి వేడి చేసే ఆహారాలను తినవద్దు. కారంగా, పుల్లగా ఉండే ఆహారాలు తినాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి