Menthol cigarettes: మెంతాల్ సిగరెట్స్ తాగుతున్నారా..? మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్

|

Feb 08, 2024 | 3:38 PM

ఈ రోజుల్లో మెంతాల్ సిగరెట్ తాగే ట్రెండ్ పెరిగింది. ఇవి సాధారణ సిగరెట్‌ల కంటే తక్కువ హానిని కలిగిస్తాయన్నది చాలామంది అభిప్రాయం. మెంతాల్ సిగరెట్స్‌ను కొన్ని దేశాల్లో నిషేధించారు కూడా. మెంతాల్ సిగరెట్ అంటే ఏమిటి..? అది ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తుందో వైద్యుల ద్వారా తెలుసుకుందాం. ఇందుకోసం వైద్యులతో మాట్లాడాం.

Menthol cigarettes: మెంతాల్ సిగరెట్స్ తాగుతున్నారా..? మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్
Smoking kills
Follow us on

ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో నివసిస్తున్న ఆదేశ్ సింగ్ గత మూడు నెలలుగా దగ్గుతో బాధపడుతున్నాడు. మొదట్లో ఆదేశ్ సాధారణ ఫ్లూ లేదా దగ్గు అని భావించి పట్టించుకోలేదు. కానీ సమస్య పెరిగినప్పుడు, అతను ఢిల్లీలోని GTB హాస్పిటల్‌కి వెళ్లాడు. ఊపిరితిత్తుల సీటీ స్కాన్‌ చేయించుకోవాలని డాక్టర్‌ సూచించారు. 4 రోజుల తర్వాత స్కాన్‌ రిపోర్టు రాగా, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతమని డాక్టర్ అనుమానించారు. PET స్కాన్ చేయమని డాక్టర్ ఆదేశ్‌కు సలహా ఇచ్చాడు. ఈ స్కాన్ రిపోర్ట్ రాగానే ఆదేశ్ షాక్ అయ్యాడు. రిపోర్ట్‌లో ఆదేశ్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందని, అది ప్రస్తుతం మొదటి దశలో ఉందని తేలింది. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉంది.. సకాలంలో దాన్ని గుర్తించగలిగారు. ఆదేశ్‌ పెద్ద ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు.

సిగరెట్ తాగడం వల్ల ఆదేశ్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడమే ఇందుకు కారణం. తాను చాలా ఏళ్లుగా సిగరెట్‌ తాగుతున్నానని అతను వైద్యులకు తెలిపాడు. సిగరెట్ అలవాటు తగ్గాలంటే మెంతాల్ ఉన్న సిగరెట్ తాగాలని ఆరు నెలల క్రితం ఓ ఫ్రెండ్ ఆదేశ్‌కు సలహా ఇచ్చాడట. మెంతాల్ సిగరెట్స్ తక్కువ హానికరమని అతను చెప్పాడట. స్నేహితుడి సలహా మేరకు ఆదేశ్ 6 నెలల పాటు మెంతాల్ సిగరెట్ తాగాడు. 

ఆదేశ్‌కు మెంతాల్ సిగరెట్‌తో క్యాన్సర్ వచ్చిందా లేదా సాధారణ సిగరెట్ వల్ల వచ్చిందా అని చెప్పడం కష్టం. అయితే సాధారణ సిగరెట్‌తో పోలిస్తే మెంథాల్ సిగరెట్ చాలా హాని చేస్తుందని వైద్యులు అంటున్నారు. ఇది తక్కువ హానిని కలిగిస్తుందని ప్రజలలో తప్పుడు అభిప్రాయం ఉందంటున్నారు.

మెంథాల్ సిగరెట్లు

మెంథాల్ అనేది పిప్పరమెంటు. కొన్ని మొక్కలలో సహజంగా కనిపించే రసాయన సమ్మేళనం ఇది. మెంథాల్‌ను ల్యాబ్‌లో కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఈ మెంథాల్‌ను సిగరెట్‌లలో వాడుతారు.   మెంథాల్ సిగరెట్ తాగడం వల్ల గొంతు, శ్వాసనాళాల్లో చల్లని అనుభూతి ఉంటుంది. మెంథాల్ పొగాకు రుచి, వాసనను డామినేట్ చేసి..  గొంతుకు ఉపశమనం ఇస్తుంది. 

సిగరెట్ ధూమపానం ప్రతి సంవత్సరం 4,80,000 కంటే ఎక్కువ మంది అమెరికన్లను చంపుతుందని CDC డేటా చెబుతోంది. 16 మిలియన్ల అమెరికన్లు కనీసం ఒక తీవ్రమైన ధూమపాన సంబంధిత వ్యాధితో జీవిస్తున్నారు.

ప్రజలు మెంతాల్ సిగరెట్లకు ఎందుకు అలవాటు పడుతున్నారు?

మెంథాల్ సిగరెట్లలో నికోటిన్ ఎక్కువగా ఉంటుందని, ప్రజలు సులభంగా దానికి బానిసలవుతున్నారని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. ఇటీవలి కాలంలో పుదీనా, మెంతాల్ సిగరెట్లు తాగే ట్రెండ్ పెరుగుతోంది. మహిళల్లో కూడా ఈ సిగరెట్ తాగే అలవాటు పెరుగుతోంది. మెంతాల్ వాసన, రుచి కారణంగా ప్రజలు ఈ సిగరెట్‌ను తాగుతున్నారు. మెంథాల్ సిగరెట్లలో నికోటిన్ అధికంగా ఉండటం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుందని డాక్టర్ కిషోర్ వివరించారు.

మెంథాల్ సిగరెట్లు ప్రమాదకరం

గత కొన్నేళ్లుగా భారతదేశంలో కూడా మెంతాల్ సిగరెట్లు తాగే ట్రెండ్ పెరుగుతోందని ఆంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ కపూర్ చెప్పారు. మెంతాల్ పొగను సులభంగా పీల్చువచ్చు. దీని వల్ల తమకు నష్టం జరగదని తాగేవారు భావిస్తున్నారు. కానీ మెంథాల్ సిగరెట్లు సాధారణ సిగరెట్‌ల వలె హానికరం. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. సిగరెట్ ఎలాంటిదైనా అది ఊపిరితిత్తులకు హాని చేస్తుంది. ప్రస్తుతం యువతలో సిగరెట్‌ తాగే అలవాటు పెరుగుతోందని, దీని వల్ల చిన్న వయసులోనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడుతున్నారని చెప్పారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి