Zika virus: కరోనా వల్లే మొత్తం వ్యవస్థలన్నీ కుదేలైపోగా.. ఇప్పుడు నేనున్నానంటూ మరో కొత్త మహమ్మారి జనం గుండెల మీదకి వస్తోంది. ‘జికా’ అనే కొత్త వైరస్ ఇప్పుడు భారతదేశాన్ని భయపెడుతోంది. తాజాగా కేరళలో బయటపడిన జికా వైరస్‌తో కేంద్రం అప్రమత్తమైంది. డాక్టర్ల బృందాన్ని కేరళ పంపి వైరస్ పై అధ్యయనం చేయిస్తోంది. అన్ని దోమల వల్ల కాకుండా కేవలం డెంగీని వ్యాప్తి చేసే ఎడిస్ ఈజిప్టి దోమ జికా వైరస్ బారినపడి అది మనుషుల్ని కుట్టడం వల్లనే ఈ జికా వైరస్ మనుషుల్లోకి ఎంటరవుతుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
మనుషుల్లో జికా వైరస్ తీవ్రత మైల్డ్ నుంచి సివియర్ వరకు ఉంటుందని సికింద్రాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ స్వప్న చెబుతున్నారు. సివియర్ కేస్ లో బ్లడ్ లో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయి ఫిట్స్ రావటం జరుగుతుందని, నోటి నుంచి ముక్కు నుంచి యూరిన్ నుంచి రక్తం పోయే లక్షణాలు ఉంటాయని చెప్పారు.
ఫ్లావి వైరస్ గ్రూప్ కి చెందిందే ఈ జికా వైరస్. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోటం వల్ల దీన్ని అరికట్టవచ్చు. డెంగీ వైరస్ ని నియంత్రిస్తే జికా ని అరికట్టవచ్చు అని డాక్టర్స్ అంటున్నారు.
కేరళలో శరవేగంగా పెరుగుతోన్న జికా వైరస్ కేసులు :
కేరళలో జికా వైరస్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 40 కేసులను కేరళ సర్కారు గుర్తించింది. జికా నేపథ్యంలో కేరళలో హై-అలర్డ్ కొనసాగుతోంది. “పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాం.. వైద్య వసతుల కంటే తక్కువ సంఖ్య లోనే కొవిడ్-19 కేసులుండేలా చేయగలిగాం. ఆక్సిజన్ అందక కేరళలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు” అని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
Read also: కృష్ణాజిల్లాలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు.. ఘటనాస్థలిలోనే బైఠాయించిన మాజీ మంత్రి.!