Bacopa Monnieri: సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న నీటి బ్రాహ్మీ ఆరోగ్య ఉపయోగాలు ఎన్నో..

|

Feb 27, 2022 | 5:06 PM

Bacopa Monnieri: నీటి దగ్గర తరచుగా కనిపించే లతలా అల్లుకునే మొక్క నీటి బ్రాహ్మీ(Water Hyssop) లేదా బకొప మొన్నిఎరి. ఇది పుష్పించే జాతికి చెందింది. ఈ మొక్కను తమిళులు(Tamils) నీర్బ్రహ్మీగా పిలుస్తారు..

Bacopa Monnieri: సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న నీటి బ్రాహ్మీ ఆరోగ్య ఉపయోగాలు ఎన్నో..
Bacopa Monnieri
Follow us on

Bacopa Monnieri: నీటి దగ్గర తరచుగా కనిపించే లతలా అల్లుకునే మొక్క నీటి బ్రాహ్మీ(Water Hyssop) లేదా బకొప మొన్నిఎరి. ఇది పుష్పించే జాతికి చెందింది. ఈ మొక్కను తమిళులు(Tamils) నీర్బ్రహ్మీగా పిలుస్తారు. ఈ నీరబ్రాహ్మీ .. త్రిమూర్తుల్లో ఒకరు సృష్టి కర్త  బ్రహ్మ(Bhrahma) పేరు మీద ప్రఖ్యాతిగాంచింది. ఈ బకొప మొన్నిఎరి ని సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా అల్జీమర్ వ్యాధి , జ్ఞాపకశక్తి, ఆందోళన వంటి వ్యాధులకు ఉపయోగిస్తారు. నరాల సంబంధిత వ్యాధుల్లో ఈ మొక్కను ఔషధంగా పరిశోధనలు చేస్తున్నారు. సాంప్రదాయకంగా నరాల టానిక్, అభిజ్ఞ పెంచే సాధనంగా ఉపయోగపడుతుంది.

నీటి బ్రాహ్మీ ఉపయోగాలు: 

  • బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. నీటి బ్రాహ్మీ లో బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్స్, సపోనిన్లు , ఆల్కలాయిడ్స్ వంటి క్రియాశీల పదార్ధాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదల, వ్యాప్తిని నిరోధిస్తాయి. అందువలన.. నీటి బ్రహ్మి శరీరంలోని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
  • నీటి బ్రాహ్మీ కొన్ని మెదడు రసాయనాలను పెంచుతుంది. అంతేకాదు అల్జీమర్ వ్యాధికి సంబంధించిన రసాయనాల నుండి మెదడు కణాలను కూడా రక్షించవచ్చు.
  • మూర్ఛ రోగాలకు నివారణ ఉపయోగిస్తారు.
  • ఉబ్బసం చికిత్సలోనూ ఉపయోగకరం
  • బాకోపా మొన్నీరి రసం గ్యాస్ట్రిక్, కడుపు పూతల నుండి రక్షిస్తుంది. ఈ ప్రత్యేకమైన హెర్బ్ ఔషధం అల్సర్లలో 50% నయం చేయగలదని అధ్యయనాలు వెల్లడించాయి.
  • ఆల్కహాల్, డ్రగ్స్, కెమికల్స్ , టాక్సిన్ లోడ్  అధికంగా వినియోగిస్తే.. అవి కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.  కాలేయం దెబ్బతిన్నప్పుడు కాలేయ ఎంజైమ్‌ల స్థాయి పెరుగుతుంది. అయితే ఈ నీటి బ్రహ్మిని ఉపయోగించడం వలన  కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు కాలేయ ఎంజైమ్ స్థాయిని.. సాధారణ స్థాయికి తీసుకురావడంలో సహాయపదాటాయి.
  • బాకోపా మొన్నీరిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరం నుండి టాక్సిన్స్ , ఇతర ప్రమాదకరమైన పదార్థాలను బయటకు పంపుతాయి.
  • బాకోపా ఆలోచన, అభ్యాసం, జ్ఞాపకశక్తి, హైపర్యాక్టివిటీ డిజార్డర్ కోసం ఉపయోగిస్తున్నారు.
  • కణితులు, రక్తహినత, జలోదరం, విస్తారిత ప్లీహము, అజీర్ణం, వాపులు, లెప్రసీలకు ఈ మొక్కను ఉపయెగిస్తారు

(అందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి)

Also Read:

 అనంతలో జింక మాంసం కలకలం.. మాంసం వండుతున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు