Roselle Fruit: షుగర్ కంట్రోల్ కోసం గోంగూర కాయలతో ఇలా చేసి చూడండి.. మంచి ఫలితం మీ సొంతం..

Roselle Fruit: ప్రకృతి ఇచ్చిన దివ్య వరం ఆకుకూరలు. అలాంటి ఆకుకూరల్లో ఒకటి గోంగూర. పుల్ల పుల్లగా ఉండే ఈ గోంగూర పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది..

Roselle Fruit: షుగర్ కంట్రోల్ కోసం గోంగూర కాయలతో ఇలా చేసి చూడండి.. మంచి ఫలితం మీ సొంతం..
Roselle Fruit Water

Updated on: Nov 13, 2021 | 8:51 PM

Roselle Fruit: ప్రకృతి ఇచ్చిన దివ్య వరం ఆకుకూరలు. అలాంటి ఆకుకూరల్లో ఒకటి గోంగూర. పుల్ల పుల్లగా ఉండే ఈ గోంగూర పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోంగూర పచ్చడిని ఆంధ్రమాత అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఈ  దేశవాళీ గోంగూర కాండము, ఆకుల తొడిమలు, ఈనెలు, పూవు లోని రక్షణ పత్రములు మొదలైన భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ గొంగూర అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాదు.. బోలెడన్ని పోషకాలున్నాయి. అయితే గోంగూరతో కంటే ఎక్కువ ప్రయోజనాలను గోంగూర కాయలు, పువ్వుల్లో ఉన్నాయట. వీటిని ఔషధ విలువ కోసం సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు.

ముఖ్యంగా గోంగూర కాయలు అధిక రక్తపోటు, గాయాలు, పూతల , జలుబుల నివారణకు సహాయపడుతుందని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో కండ్లకలక చికిత్సకు ఉపయోగిస్తారు.

*గోంగూర కాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.
*షుగర్ పేషేంట్స్ కు గోంగూర పువ్వులు ఓ దివ్య వరం.  షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడానికి గ్లాస్ వాటర్‌లో మూడు లేదా నాలుగు గోంగూర పువ్వులు వేసుకుని బాగా మరిగించి.. పరగడుపున తీసుకోవాలి.
*అంతేకాదు గోంగూర పువ్వు తో చేసిన నీటిని రోజు పరగడుపున తాగితే అధిక బరువు సమస్య దూరం అవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బల పడి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.
*గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి.. దానిని వడకట్టి.. అరకప్పు రసంలో అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగాల్సి ఉంది.
*తరచూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది .
*గోంగూర పువ్వులు వేసి మరిగించిన నీటిని సేవించటం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు నయం అవుతాయి. కిడ్నీలు శుభ్ర పడతాయి. మెదడు పని తీరు మెరుగు పడుతుంది.
*జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది. కంటి చూపు పెరుగుతుంది. చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.

Also Read:  దుర్గ పూజ కోసం బంగారు మాస్క్ చేయించుకున్న ఓ వ్యాపారి.. ధర తెలిస్తే షాక్..