Papaya Seeds: పురుషులకు బొప్పాయి గింజలు నిజంగా వరమే.. తిన్నారంటే ఆ పనిలో తగ్గేదేలే..!

|

Mar 09, 2023 | 5:51 PM

పుచ్చకాయ గింజలు తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ మెరుగుపడుతుంది. అంతేకాక పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు అవసరమైన జింక్.. పురుషుల లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరిచే ..

Papaya Seeds: పురుషులకు బొప్పాయి గింజలు నిజంగా వరమే.. తిన్నారంటే ఆ పనిలో తగ్గేదేలే..!
Papaya Seeds For Health
Follow us on

కాలనుగుణంగా సంక్రమించే అన్ని రకాల ఆరోగ్య సమస్యలను నియంత్రించేందుకు పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకోసం మనం నిత్యం పండ్లు, కూరగాయలను తింటే సరిపోతుంది. అలా మన ఆరోగ్యానికి ప్రయోజనాలను చేకూర్చే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఈ పండును తరచుగా తీసుకుంటే మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది. బొప్పాయిలో ఎ, బి, సి, ఇ, కె వంటి పలు విటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. హైపర్‌టెన్షన్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచుతాయి. జీర్ణక్రియకు మేలు చేసి.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అయితే బొప్పాయి మాత్రమే కాక దాని గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణుల చెబుతున్నారు. మనం వేస్ట్‌ అని బయట పారేసే బొప్పాయి గింజలు అనేక ఆరోగ్యాల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాక పురుఫుల పునరుత్పత్తి వ్యవస్థకు, శృంగార సామార్థ్యాన్ని మెరుగు పరిచేందుకు కూడా ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంకా బొప్పాయి గింజలను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి గింజల ప్రయోజనాలు:

పురుషులకు ప్రయోజనకరం: పుచ్చకాయ గింజలు తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ మెరుగుపడుతుంది. అంతేకాక పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు అవసరమైన జింక్.. పురుషుల లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరిచే గ్లుటామిక్ యాసిడ్, మాంగనీస్, లైకోపీన్, లైసిన్, అర్జినిన్ ఉంటాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల పురుషులలో సంతానోత్పత్తి పెరగడమే కాకుండా, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇన్ఫ్లమేషన్‌:బొప్పాయి గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్‌‌‌‌‌‌‌‌‌, పాలీఫెనాల్స్ వంటి ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీలుగా పనిచేస్తాయి. గౌట్, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్నావారు బొప్పాయి గింజలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు: బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు ఎదురుకావు. అంతేకాకుండా శరీరంలో అదనపు కొవ్వును నిల్వ చేయకుండా నిరోధిస్తుంది. ఫలితంగా శరీర బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
నెలసరి నొప్పి: బొప్పాయి గింజలలో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా ఋతుక్రమాన్ని ప్రేరేపించడంలో, దాని క్రమబద్ధతను పెంచడంలో ఇవి తోడ్పడతాయి. నెలసరి సమయంలో నొప్పిని తగ్గించడానికి కూడా బొప్పాయి గింజలు సహాయపడతాయి.క్యాన్సర్‌ నిరోధిని: బొప్పాయి గింజల్లో ఉండే పాలీఫెనాల్స్.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి అనేక రకాల క్యాన్సర‌ నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యాన్సర్‌కు దూరంగా ఉండాలంటే.. 5, 6 బొప్పాయి గింజల పొడితో టీ చేసుకుని తాగండి.
కొలెస్ట్రాల్‌: బొప్పాయి గింజల్లోని ఫైబర్‌‌‌‌ శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బొప్పాయి గింజల్లో ఒలీక్ యాసిడ్‌, ఇతర మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి.

ఒక రోజులో ఎన్ని తినాలి..?

ఏదైనా పరిమితిగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఆ క్రమంలో బొప్పాయి గింజలను కూడా పరిమితిగానే తీసుకోవాలి. ఇంకా ఒక రోజులో 1 గ్రాము లేదా 5 బొప్పాయి గింజల కంటే ఎక్కువ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి గింజలను పచ్చిగా కూడా తినచ్చు, లేదా పౌడర్‌ రూపంలోనూ తీసుకోవచ్చు. కానీ వీటిని తీసుకునే ముందు డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి