Arikelu: డెంగ్యూ, టైఫాయిడ్, వైరస్ వ్యాధుల బారిన పడ్డారా.. వెంటనే కోలుకోవడానికి ఈ సిరిధాన్యాన్ని ఆహారంగా తీసుకోండి..

|

Jul 23, 2021 | 9:46 PM

Benefits of Arikelu: కాలంతో పాటు మనిషి నడక, నడత, ఆహారం ఆహార్యం ఇలా అనేక విషయాల్లో మార్పులు వచ్చాయి. మార్పుల్లో భాగంగా అన్నం, చపాతీ వంటి వాటితో పాటు.. మేగీలు, పిజ్జాలు..

Arikelu: డెంగ్యూ, టైఫాయిడ్, వైరస్ వ్యాధుల బారిన పడ్డారా.. వెంటనే కోలుకోవడానికి ఈ సిరిధాన్యాన్ని ఆహారంగా తీసుకోండి..
Kodo Millet
Follow us on

Benefits of Arikelu: కాలంతో పాటు మనిషి నడక, నడత, ఆహారం ఆహార్యం ఇలా అనేక విషయాల్లో మార్పులు వచ్చాయి. మార్పుల్లో భాగంగా అన్నం, చపాతీ వంటి వాటితో పాటు.. మేగిలు, పిజ్జాలు.. వంటి అనేక ఆహారపదార్ధాలు తింటున్నాము కానీ పూర్వకాలంలో సిరిధాన్యాలైన రాగులు, కొర్రలు, సజ్జలు, అరికెల వంటి వాటిని ఆహారంగా తినేవారు. ఇవి ఆకలి తీర్చడమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చేవి. సిరిధాన్యాల్లో ఒకటి అరికెలు. ఇవి వగరు, చేదు రుచిని కలగలిపి ఉంటాయి. అయితేమాత్రం ఏమిటి..ఎన్నో పోషకాలను కలిగి ఉన్న ఈ అరికెల పిల్లల ఆరోగ్యంగా పెరుగుదలకు మంచి ఆహారం. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. ప్రేగు క్యాన్సర్ వాటిని వాటిని దరిచేరకుండా అరికెలు నివారిస్తాయి. ఈరోజు అరికెల ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

అరికెల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. ఇవి షుగర్ లెవెల్స్ ను, కొలెస్టరాల్ స్థాయిని అదుపులో ఉంచుతాయి, అరికెలను బొబ్బర్లు కానీ శనగల తో కానీ కలిసి ఆహారంగా తీసుకుంటే శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి, అరికెల్లో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళ కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గడానికి అరికెల మంచి ఆహరం. వాతరోగాలకు ముఖ్యంగా కీళ్ల వాతానికి, రుతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెలు మంచి ఆహరం. పరుగు పందాలలో పాల్గొనే వారికీ మంచి శక్తినిస్తుంది. రక్తశుద్ధి ని చేస్తాయి, రక్తహీనతను తగ్గిస్తాయి అంతేకాదు అరికెలు రెగ్యులర్ గా తీసుకునేవారిలో అధికంగా రోగ నిరోధక శక్తి ఉంటుంది. షుగర్ పేషేంట్స్ కుమంచి ఆహారం, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మంచి నిద్రను ఇస్తుంది. అంతేకాదు డెంగ్యూ టైఫాయిడ్, వైరస్ బారిన పడివారికి అనేక ప్రయోజనాలని ఇస్తాయి. వారిలో రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికెలు. ఇక అరిక పిండిని వాపులకు పై పూతగా కూడా వాడతారు. ఇన్ని ప్రయోజాలున్న అరికెలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.. సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు సేఫ్ గా ఉంచుకోండి.

Also Read: Darshan Tickets: కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో దర్శన టికెట్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం