Amla Benefits: ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉసిరిలో విటమిన్ -సి ఎంతో మేలు చేస్తుంది. జలుబు లేదా దగ్గును నివారించడానికి ఉసిరికాయ ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మలబద్దకం, మధుమేహం వంటి వ్యాధులున్నవారికి ఎంతో మేలని, ఎన్నో రకాల వ్యాధులను తగ్గించేందుకు ఉసిరికాయ ఉపయోగపడుతుంది. ఉసిరి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉసిరి తినడం వల్ల చర్మ సమస్యలు, జట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇందులో సి విటమిన్ ఉండటం వల్ల చర్మ వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.
ఉసిరిలో పోషకాలు అధికం..
ఉసిరిలో నారింజ పండ్ల కన్నా 20 శాతం ఎక్కువ విటమిన్ పోషకాలు ఉంటాయి. ఉసిరి చర్మపు ముడుతలను సైతం నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కోవిడ్ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం. ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. మన తరచూ ఉసిరిని తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఇలా కూడా తింటే మంచిదే..
మనం నేరుగా ఉసిరిని ఎక్కువగా తినలేము కాబట్టి, దీనిని ఆహారంలో ఉడకబెట్టడం లేదా పచ్చడి చేయడం ద్వారా తినవచ్చు. తేనెతో కూడా తినవచ్చు. ఖాళీ కడుపుతో ఉసిరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు వైద్యులు.
ఉసిరి జ్యూస్‌లో బరువు తగ్గొచ్చు..
ఉసిరి జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను సైతం నియంత్రించుకోవచ్చు. ఇది శరీర బరువును అదుపులో ఉంచడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ జ్యూస్ రోజూ తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను తొలగించుకోవచ్చు. అలాగే ఉసిరి రసం చర్మంపై నల్లటి మచ్చలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖం మీద ఉసిరి రసం ఉంచడం వల్ల రంధ్రాలు పోతాయి. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఉసిరి రసం తాగడం మంచిది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్న వారికి ఈ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. పచ్చి ఉసిరికాయలు తినడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులకు ఊసిరి చక్కటి ఔషధంగా పని చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
(గమనిక: ఇందులోని అంశాలన్నీ వైద్య నిపుణుల వివరాల ప్రకారం అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)