Cinnamon Health Tips: దాల్చిన చెక్కతో ఈ వ్యాధులకు, కెమికల్స్ కి చెక్ పెట్టవచ్చు!!

|

Aug 07, 2023 | 7:24 PM

నాన్ వెజ్ వంటలు, మసాలాలతో తయారు చేసే వెజ్ వంటలైనా, బిర్యానీ అయినా, బగారా రైస్, పలవ అయినా ఘుమఘుమలాడాలంటే దాల్చిన చెక్క ఉండాల్సిందే. వేసేది కొంచమే అయినా.. దాని రుచి, వాసన ఎంతో బాగుంటుంది. అలాగే దాల్చిన చెక్క ఎంతో ఘాటుగా కూడా ఉంటుంది. ముఖ్యంగా దాల్చిన చెక్కతో కొన్ని వ్యాధులకు, కెమికల్స్ కి చెక్ పెట్టవచ్చు. ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీలు దాగి ఉన్న దాల్చిన చెక్కను ఎలా వాడితే..

Cinnamon Health Tips: దాల్చిన చెక్కతో ఈ వ్యాధులకు, కెమికల్స్ కి చెక్ పెట్టవచ్చు!!
Cinnamon
Follow us on

నాన్ వెజ్ వంటలు, మసాలాలతో తయారు చేసే వెజ్ వంటలైనా, బిర్యానీ అయినా, బగారా రైస్, పలవ అయినా ఘుమఘుమలాడాలంటే దాల్చిన చెక్క ఉండాల్సిందే. వేసేది కొంచమే అయినా.. దాని రుచి, వాసన ఎంతో బాగుంటుంది. అలాగే దాల్చిన చెక్క ఎంతో ఘాటుగా కూడా ఉంటుంది. ముఖ్యంగా దాల్చిన చెక్కతో కొన్ని వ్యాధులకు, కెమికల్స్ కి చెక్ పెట్టవచ్చు. ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీలు దాగి ఉన్న దాల్చిన చెక్కను ఎలా వాడితే.. ఎలాంటి ఉపయోగాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

-ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్య డయాబెటీస్. రక్తంలో చక్కెర కణంలోకి చేరకుండా.. రక్తంలోనే మిగిలిపోవడం వల్ల ఈ షుగర్ వ్యాధి వస్తుంది.

-దాల్చిన చెక్కలో ఫోర్ హైడ్రాక్సీ సినిమాల్డ్ హెయిడ్, సినామిక్ యాసిడ్ అనే కెమికల్స్ ప్రధానంగా ఉంటాయి. ఇవి బీటా కణాలను యాక్టివేట్ చేసి.. కణం లోపలికి చక్కెర వెళ్లేలా పనిచేస్తాయి. అందుకే దాల్చిన చెక్క పొడిని తరచూ తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధిని కంట్రోల్ లో ఉంచవచ్చు.

ఇవి కూడా చదవండి

-వయసు పెరగకుండానే మతిమరుపు పెరిగేవారికి దాల్చిన చెక్కతో మంచి వైద్యం చేయొచ్చు. మెదడు కణాల్లో వచ్చే ఇన్ ఫ్లమేషన్ వల్ల అవి వీక్ అయి ఆలోచనా శక్తి తగ్గడం, మతిమరుపు పెరగడం వంటివి చూస్తుంటాం. దాల్చిన చెక్కలో ఉండే సిలోన్ సినిమాల్డ్ హెయిడ్ అనే కెమికల్ మెదడు కణజాలంలో వచ్చే హానికరమైన కెమికల్ ను చంపేస్తుందని అమెరికా సైంటిస్టులు చేసిన పరిశోధనలో తేలింది. ఫలితంగా మతిమరుపు తగ్గి మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది.

-దాల్చిన చెక్కలో ఉండే సినిమాల్డ్ హెయిడ్, సినామిక్ యాసిడ్ లు శరీర రక్షణ వ్యవస్థను కాపాడుతాయి. ఇవి క్యాన్సర్ కణాలను వాటంతట అవే చనిపోయేలా ప్రేరేపిస్తాయి.

-అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను, బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడంలోనూ సినిమాల్డ్ హెయిడ్ కెమికల్ కీలక పాత్ర పోషిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాం చేసిన పరిశోధనలో తేలింది.

-అప్పుడప్పుడు దాల్చిన చెక్కను తినడం వల్ల యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గా కూడా ఉపయోగపడుతుంది. చర్మసంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

-రోజూ ఉదయాన్నే పరగడుపున దాల్చిన చెక్క పొడిని వేడినీటిలో కలుపుకుని తాగితే అధిక బరువుకు కూడా బైబై చెప్పవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి