Fenugreek
ఈరోజుల్లో ఎంతో మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే జీవనశైలి కారణంగా, ఆహార నియమాలలో మార్పుల వల్ల రకరకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి. సాధారణంగా చాలా మంది ఎదుర్కొనే సమస్య కడుపుబ్బరం, అజీర్తి, మలబద్దకం లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యలన్నింటికి వంటింట్లోనే చక్కని పరిష్కారం లభిస్తుంది. నిత్యం వంటల్లో ఉపయోగించే జీలకర్ర, మెంతులు, పసుపు, ఇలాచ్చి, లవంగం, అల్లం, వెల్లుల్లి లాంటి వాటిని వివిధ రకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి అద్భుతమైన ఔషధాలుగా ఉపయోగపడతాయి. అందులో అజీర్తి సమస్యకు మెంతులు పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
- మెంతులు రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తుంది. మధుమేహం వ్యాధి ఉన్నవారికి షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. వారికి మెంతులుదివ్యమైన ఔషధంలా పనిచేస్తాయి.
- అజీర్తి, కడుపుబ్బరం సమస్యలను కూడా మెంతులు మంచి ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు. రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే పరిగడుపున ఆ నీళ్లను తాగాలి. దాంతో అజీర్తి సమస్య దూరం అవుతుంది.
- మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దాంతో మనం మోతాదుకు మించిన ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. ఆహారం మితంగా తీసుకోవడంవల్ల ఒంట్లో కొవ్వు కరుగుతుంది. అందుకే స్థూలకాయులకు కూడా మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి.
- మెంతి గింజలను పెనం మీద వేయించి పొడి చేసుకోవాలి. రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
- ఒక చెంచా మెంతులను రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడంవల్ల కూడా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు తోడ్పడుతాయి
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి