మన పెద్దలు చెప్పిన ఆహారపు అలవాట్లలో ఎన్నో ఆయుర్వేద ఔషధాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన ఆహారంలో విరివిగా వాడే అల్లం, వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో కలిగే అనేక వ్యాధులతో పోరాడే గుణం కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచేందుకు ఈ రెండు దోహదపడుతాయి. అందుకే అల్లం వెల్లుల్లి మనం చేసే ప్రతి వంటలోను ఉపయోగిస్తాం. ముఖ్యంగా అల్లం అనేది సర్వరోగ నివారిణి అని చెప్పుకోవచ్చు. అల్లంలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో అనేక జబ్బులను తగ్గించడానికి సహాయపడుతాయి. ఉదర సంబంధిత వ్యాధులతో పాటు చర్మ సంబంధిత వ్యాధుల వరకు అల్లం అన్ని దశల్లోనూ ఉపయోగపడుతుంది. అల్లం రసం చర్మం పైపూతగా రాసుకోవడం ద్వారా కూడా అనేక జబ్బుల నుంచి బయటపడే అవకాశం ఉంది.
ఇన్ని అద్భుతమై గుణాలు ఉన్నటువంటి అల్లం నిత్య జీవితంలో జబ్బులు బారిన పడకుండా ఎలా వాడాలో తెలుసుకుందాం..
జీర్ణ ప్రక్రియను పెంచుతుంది:
ప్రస్తుత జీవన శైలిలో మనం బయటకు వెళ్ళినప్పుడు అక్కడి ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అలాంటి సమయంలో, మీ కడుపు పాడయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆహారం జీర్ణం కాకపోవటం వల్ల గ్యాస్ సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మలబద్ధకం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి బయట పడాలంటే ప్రతిరోజు కొన్ని అల్లం ముక్కలను బుగ్గన పెట్టుకొని నములుతూ ఉంటే జీర్ణక్రియకు చాలా మంచిది. యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలు:
అల్లం యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో ఏదైనా జబ్బు లేదా ఇన్ఫెక్షన్ ప్రవేశించింది అంటే మన శరీరంలో ఇన్ ఫ్లమేటరీ అనేది పెరుగుతుంది. బ్లడ్ టెస్ట్ లో కూడా ఇన్ఫ్లమేటరీని గమనించవచ్చు. అంటే ఇన్ ఫ్లమేటరీ లెవెల్ ను బట్టి మన శరీరంలో వ్యాధి తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఈ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను అల్లం తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మీ శరీరంలో అల్లం ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు అల్లం రసం తేనెలో కలుపుకొని తీసుకోవడం ద్వారా ఈ వ్యాధికారకాలను తగ్గించుకోవచ్చు
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. ఒక అధ్యయనంలో అల్లం రసం సప్లిమెంట్ తీసుకున్న వారిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 28 శాతం తగ్గాయని తేలింది.
రక్త ప్రసరణను పెంచుతుంది:
అల్లం రసం రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, కండరాల నొప్పిని తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతుంది. అల్లం స్పైసి ఫ్లేవర్ మిమ్మల్ని ఉదయాన్నే మేల్కొలపడానికి, మీకు సహజమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి