Alcohol Consumption: మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..

|

Apr 16, 2021 | 5:52 PM

Alcohol Consumption: కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ పలు అవాస్తవాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్నాయి. అందులో ఒకటే

Alcohol Consumption: మద్యం సేవిస్తే కరోనా వైరస్ తగ్గుతుందా.? అపోహలు.. నిజాలు.! వివరాలివే..
Liquor
Follow us on

కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ పలు అవాస్తవాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్నాయి. అందులో ఒకటే మద్యం సేవించడం.. మద్యం సేవించడం వల్ల కరోనా వైరస్ సోకదని పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఆల్కహాల్ వినియోగం వైరస్ తీవ్రతను మరింత ప్రమాదకరం చేస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. యూరోపియన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, వైరస్ సంక్రమణ తగ్గదని, కోవిడ్-19కు సంబంధించి అనారోగ్యంపైన ఆల్కహాల్ ఎలాంటి ప్రభావం చూపించదని తెలిపింది. వాస్తవానికి, మద్యం సేవించడం వల్ల COVID-19 ఇన్ఫెక్షన్ తీవ్రత అధికమవుతుందని స్పష్టం చేసింది.

అపోహ 1: ఆల్కహాల్ వైరస్‌ను చంపుతుంది…

వాస్తవం: ఆల్కహాల్ SARS-CoV-2ను చంపదు.

పలు జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. 60-90% ఆల్కహాల్ మూలాలు కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్‌లను చంపగలవని తెలుస్తోంది. చర్మంపై వైరస్‌ను ఆల్కహాల్ నాశనం చేస్తుందని.. శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ లాంటి మహమ్మారిని మాత్రం చంపలేదని యూరోపియన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

అపోహ 2: ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వాస్తవం: కరోనా సమయంలో ఆల్కహాల్ వినియోగం రోగనిరోధక వ్యవస్థపై అత్యంత ప్రమాదకరం

యూరోపియన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థకు ఆల్కహాల్ సహాయపడుతుందని అనేది పూర్తిగా అవాస్తవం. అధికంగా మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది.

అపోహ 3: ఆల్కహాల్ గాలిలోని వైరస్‌ను నాశనం చేస్తుందా.?

వాస్తవం: ఆల్కహాల్ నోటిని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించదు

ఆల్కహాల్ గాలిలోని వైరస్‌ను నాశనం చేయలేదు. మద్యం సేవించడం వల్ల వైరస్ సంక్రమణ తగ్గదు.

ఆల్కహాల్, రోగనిరోధక శక్తి…

ఆల్కహాల్ రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మద్యం సేవించడం వల్ల న్యుమోనియా, క్షయ వంటి ప్రమాదకర అంటు వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంది. 2015లో ఆల్కహాల్ రీసెర్చ్ ట్రస్టెడ్ సోర్సెస్ జర్నల్‌లో ప్రచురించిన కథనం ప్రకారం.. ఆల్కహాల్ రోగనిరోధక కణాలను సరిగ్గా పనిచేయకుండా నిరోధించగలదని.. అంతేకాకుండా ఇన్ఫెక్షన్‌తో పోరాడే రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుందని తెలుస్తోంది.

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..