పెరుగుతున్న వేడి(Summer), చెమట నుంచి ఉపశమనం పొందడానికి ఎయిర్ కండిషనర్లను(ఏసీ) (air conditioner) ఆశ్రయిస్తుంటాం. కానీ మనిషికి ఈ అవసరం ప్రస్తుతం వ్యసనంగా మారింది. ఇల్లు, ఆఫీస్, కారు అన్నీ ఎయిర్ కండిషన్‌గా మారిపోయాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ప్రజలు ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. అయితే ఈ ఎయిర్ కండీషనర్ వ్యసనం మన శరీరాన్ని(Health) ఎంత దారుణంగా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా? పూర్తి వివరాలు తెలుసుకుంటే మాత్రం మీరు అవుననే అంటారు. అధికంగా ఏసీలు వాడడంవల్ల మనకు ఎదురయ్యే పరిస్థితులను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్వాస సంబంధిత సమస్యలు – ఎక్కువ సేపు ఏసీలో ఉండే వారు ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. గొంతు పొడిబారడం, రినిటిస్, నాసికా అడ్డుపడటం వంటి సమస్యలతో బాధపడవచ్చు. రినిటిస్ అనేది ముక్కు శ్లేష్మ పొరలలో వాపును ప్రోత్సహించే ఒక పరిస్థితి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ ప్రతిచర్య కారణంగా జరుగుతుంది.
ఆస్తమా, అలర్జీలు – ఆస్తమా, అలర్జీలతో బాధపడేవారికి AC మరింత ప్రమాదకరం. కాలుష్యాన్ని నివారించేందుకు తరచుగా ఇంట్లోనే ఏసీలను అమర్చుకుంటుంటారు. అయితే ఇంట్లో ఉన్న ఏసీని సరిగ్గా శుభ్రం చేయకపోతే ఆస్తమా, అలర్జీలతో బాధపడేవారికి ఇబ్బందులు కలుగుతాయి.
ఇన్ఫెక్షియస్ డిసీజ్ – ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల మన ముక్కులు పొడిబారతాయి. దీనివల్ల శ్లేష్మ పొరల సమస్య కూడా పెరుగుతుంది. రక్షిత శ్లేష్మం లేకుండా, వైరల్ సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
డీహైడ్రేషన్ – గది ఉష్ణోగ్రతతో పోలిస్తే ACలో నివసించేవారిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. AC గదిలో ఎక్కువ తేమను గ్రహిస్తే, మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.
తలనొప్పి – AC వల్ల వచ్చే డీహైడ్రేషన్ సమస్య కూడా తలనొప్పి లేదా మైగ్రేన్‌కు కారణం కావచ్చు. నిర్జలీకరణం అనేది మైగ్రేన్ విషయంలో తరచుగా పట్టించుకోని ట్రిగ్గర్‌గా మారుతుంది. ఏసీలో ఉండి వెంటనే ఎండలోకి వెళితే తలనొప్పి సమస్య పెరుగుతుంది. మీరు ఏసీ గదిని సరిగ్గా నిర్వహించకపోయినా, తలనొప్పి, మైగ్రేన్ సమస్య పెరుగుతుంది.
కళ్లు పొడిబారడం – మీకు కళ్లు పొడిబారడం అనే సమస్య ఉంటే, ఎక్కువ సేపు ఏసీలో ఉండడం మీకు అస్సలు మంచిది కాదు. కళ్ళలో దురద, అసౌకర్యం ఈ సమస్య చాలా కష్టాలను కలిగిస్తుంది. డ్రై ఐ సిండ్రోమ్‌తో బాధపడేవారు ఎక్కువసేపు ఏసీలో ఉండకూడదని సూచిస్తున్నారు.
పొడి చర్మం – ఏసీలో ఎక్కువ సేపు కూర్చునేవారిలో దురద లేదా పొడి చర్మం సమస్య చాలా సాధారణం. బలమైన సూర్య కిరణాలకు గురికావడంతోపాటు ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల పొడి చర్మం సమస్య పెరుగుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Health News: అర్ధరాత్రి భోజనం చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
Tomato Ketchup: కమ్మగా ఉందని కెచప్‌ను తెగ తింటున్నారా.. అయితే, ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే..