Cancer Test: ఒకే రక్త పరీక్షతో 50 రకాల కేన్సర్ లను గుర్తించే అవకాశం..ఫలితాన్నిస్తున్న పరిశోధనలు!

|

Jun 30, 2021 | 6:00 PM

Cancer Test: ఒకే రక్త పరీక్షలో 50 రకాల కేన్సర్ ను ప్రారంభంలో గుర్తించవచ్చు. చాలా వరకు, కేన్సర్ శరీరంలో ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు.

Cancer Test: ఒకే రక్త పరీక్షతో 50 రకాల కేన్సర్ లను గుర్తించే అవకాశం..ఫలితాన్నిస్తున్న పరిశోధనలు!
Cancer Test
Follow us on

Cancer Test: ఒకే రక్త పరీక్షలో 50 రకాల కేన్సర్ ను ప్రారంభంలో గుర్తించవచ్చు. చాలా వరకు, కేన్సర్ శరీరంలో ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇంగ్లండ్ ఆరోగ్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీసెస్ పైలట్ అధ్యయనంగా ఈ రక్త పరీక్షను ప్రారంభించింది. శాస్త్రవేత్తలు, ఈ రక్త పరీక్ష లక్ష్యం 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం. ది గార్డియన్ కథనం ప్రకారం, రక్త పరీక్షలతో తల, మెడ, అండాశయం, పెన్క్రియాటిక్, ఐసోఫెగ్ల్, రక్త కేన్సర్ల ను ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. పరీక్ష ఆధారంగా వ్యాధుల అంచనా నిరూపించబడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, ఈ పరీక్ష సహాయంతో, రక్త కేన్సర్ వంటి 55.1% కేసుల వరకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వవచ్చు. అదే సమయంలో, వ్యాధి తప్పుగా నిరూపించబడే సంభావ్యత 0.5 శాతం మాత్రమే.

రక్త పరీక్ష ఈ విధంగా పనిచేస్తుంది

అన్నల్స్ ఆఫ్ ఆంకాలజీ పత్రికలో ప్రచురించిన పరిశోధనల ప్రకారం, ఈ ప్రత్యేకమైన రక్త పరీక్షను అమెరికన్ కంపెనీ గ్రెయిల్ అభివృద్ధి చేసింది. శరీరంలో పెరుగుతున్న కణితులు రక్తంలో ఉన్న జన్యు సంకేతంలో మార్పులకు కారణమవుతాయి. ఈ జన్యు సంకేతాలు ప్రారంభంలో వ్యాధులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. సంస్థ చెబుతున్న దాని ప్రకారం, ఈ పరీక్ష సహాయంతో, కేన్సర్ సంకేతాన్ని అర్థం చేసుకోవచ్చు. కేన్సర్ నిర్ధారించబడిన తర్వాత, శాస్త్రవేత్తలు ఏ అవయవానికి వ్యాధి సంకేతాలను పొందుతున్నారో తెలుసుకుంటారు. ఈ విధంగా శరీరంలో ఎక్కడ కేన్సర్ వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే అవకాశం ముందుగానే కలుగుతుంది. ఈ పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన టెక్నాలజీ డీఎన్‌ఏను పరిశీలిస్తుంది. దానిలో దాగి ఉన్న కణితి సంకేతాలను అర్థం చేసుకుంటుంది.

6200 మందిపై పరిశోధన..

50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల 6200 మందిపై గ్రెయిల్ రక్త పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) 1 లక్ష 40 వేల మందిపై ఈ పరీక్ష చేయనుంది. ఎన్‌హెచ్‌ఎస్ ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను 2023 నాటికి విడుదల చేయవచ్చు. ఈ విధానం అందుబాటులోకి వస్తే, కేన్సర్ కేసుల భారం తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేన్సర్ ను ముందుగానే గుర్తించినట్లయితే, చికిత్స విజయవంతంగా చేయవచ్చు. ఇది కేన్సర్ కేసుల పెరుగుదలను కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది.

Also Read: Benefits of Crying: నవ్వితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో ఏడిస్తే కూడా అన్నే ఉన్నాయట

Trouble With Sore Throat : గొంతు నొప్పితో ఇబ్బందా..! అయితే ఆపిల్ సైడర్ వెనిగర్‌తో ఇలా చేయండి..