హెల్తీ లైఫ్ కోసం మీ డైట్‌లో తప్పక ఉండాల్సిన 7 కూరగాయలు ఇవే..!

ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహారంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉండాలి. ఇవి విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు అందించి శరీరాన్ని బలంగా ఉంచుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యల నుంచి రక్షణ ఇస్తాయి. రోజువారీ డైట్‌లో ఈ కూరగాయలను చేర్చుకుంటే ఫిట్‌గా, ఎనర్జీతో జీవించవచ్చు.

హెల్తీ లైఫ్ కోసం మీ డైట్‌లో తప్పక ఉండాల్సిన 7 కూరగాయలు ఇవే..!
Vegetables

Updated on: Aug 20, 2025 | 4:35 PM

మంచి ఆరోగ్యం కావాలంటే మన డైట్‌లో పర్ఫెక్ట్ పోషకాలు ఉండాలి. ముఖ్యంగా కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లను అందించి మనల్ని ఫిట్‌గా ఉంచుతాయి. మరి ఎలాంటి కూరగాయలు మన మెనూలో ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రోకలీ.. బ్రోకలీలో విటమిన్ C, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తరచుగా తింటే గుండె జబ్బులు తగ్గుతాయి. కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

పాలకూర.. పాలకూర ఐరన్, మెగ్నీషియం, అలాగే కొన్ని ఫైటో న్యూట్రియెంట్లతో నిండి ఉంటుంది. ఇది మనకు పవర్ ఇస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంకా అవయవాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

క్యారెట్.. క్యారెట్‌ లో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును అదుపులో ఉంచుతుంది. చర్మం మెరిసేలా చేయడంలోనూ ఇది చాలా హెల్ప్ అవుతుంది. అందుకే క్యారెట్‌ను తరచుగా ఆహారంలో చేర్చుకోవడం మస్ట్.

టమోటా.. టమోటాలో ఎక్కువగా ఉండే లైకోపీన్ గుండె ఆరోగ్యానికి బెస్ట్ ఫ్రెండ్. క్యాన్సర్ రిస్క్‌ ను తగ్గించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. స్కిన్ గ్లో కోసం టమోటా సహజంగా పనిచేస్తుంది.

వెల్లుల్లి.. వెల్లుల్లిలో నాచురల్ యాంటీబాక్టీరియల్ పదార్థాలు ఉంటాయి. ఇవి మన బాడీకి ఒక ప్రొటెక్షన్ లా పనిచేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. బీపీని తగ్గించడంలో, హార్ట్‌ ను హెల్తీగా ఉంచడంలో వెల్లుల్లి స్పెషల్‌గా పని చేస్తుంది.

స్వీట్ పొటాటో.. స్వీట్ పొటాటోలో ఫైబర్, విటమిన్ A, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి మన డైజెషన్ సిస్టమ్‌ను మెరుగుపరుస్తాయి. బీపీని కంట్రోల్ చేయడంలోనూ చిలగడదుంపలు హెల్ప్ చేస్తాయి.

కాలీఫ్లవర్.. కాలీఫ్లవర్‌లో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. సెల్స్ హెల్త్‌ను కాపాడి మన బాడీని స్ట్రాంగ్‌ గా ఉంచుతాయి.

ఈ కూరగాయలను మీ డైట్‌లో చేర్చుకుంటే బాడీకి కావాల్సిన పోషకాలు లభించడంతో పాటు.. రోగాలను నివారించే పవర్ కూడా పెరుగుతుంది. ఇంకెందుకు లేట్ ఈ వెజిటేబుల్స్ ట్రై చేసి చూడండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)