మతిమరుపు ఎక్కువు అవుతుందా.. జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు ఈ సింపుల్ టిప్స్ మీకోసం..

|

Nov 22, 2022 | 8:47 AM

నేడు చాలా మందిలో ఎక్కువుగా కనిపించే సమస్య మతిమరుపు. ఒక విషయం ఎక్కువుగా గుర్తించుకోకపోవడం, ఓ వస్తువు ఎక్కడైనా పెడితే.. కొద్దిసేపటి తర్వాత అదెక్కడ పెట్టామో మర్చిపోతూ ఉంటాం. అలాగే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మనిషిలో తక్కువుగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో..

మతిమరుపు ఎక్కువు అవుతుందా.. జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు ఈ సింపుల్ టిప్స్ మీకోసం..
Memory
Follow us on

నేడు చాలా మందిలో ఎక్కువుగా కనిపించే సమస్య మతిమరుపు. ఒక విషయం ఎక్కువుగా గుర్తించుకోకపోవడం, ఓ వస్తువు ఎక్కడైనా పెడితే.. కొద్దిసేపటి తర్వాత అదెక్కడ పెట్టామో మర్చిపోతూ ఉంటాం. అలాగే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మనిషిలో తక్కువుగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. సాధారణంగా జీవనశైలిలో మార్పులు కూడా మతిమరుపునకు కారణమని కొందరు నిపుణులు చెబుతున్నారు. గతంలో వయసు దాటినవారిలో మతిమరుపు సమస్య ఎక్కువుగా కన్పించేది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా యువతలోనూ ఈసమస్య కనిపిస్తోంది. కొంతమందిలో జ్ఞాపకశక్తి ఎక్కవుగా ఉంటే మరికొంతమందిలో ఇది తక్కువుగా ఉంటుంది. దీనికి మన చుట్టూ ఉండే పరిసరాలు, వాతావరణం కూడా ఒక కారణంగా చెప్తారు. ఈ పోటీ ప్రపంచంలో చాలామంది యువత జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లేక వెనుకబడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా మరిచిపోతున్నారు. ఏదైనా సాధించాలంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మి

బ్రహ్మి అనేది  పురాతన మూలిక. ఇది ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది. ఇది మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్రాహ్మిని తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఇది మెమరీకి సంబంధించిన సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. పాలలో లేదా నీటితో బ్రాహ్మి పౌడర్ కలపి తాగవచ్చు.

శంఖపుష్పి మూలికలు

ఆయుర్వేద వైద్యంలో శంఖపుష్పి మూలికలు విలువైనవి. ఇది మనస్సును శాంతపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి పనిచేస్తుంది. దీని కోసం మీరు గోరువెచ్చని నీటిలో టీస్పూన్ ఈ మూలికా పొడిని కలిపి తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అశ్వగంధ

ఇది ఒక పురాతన, సంప్రదాయ ఔషధ మూలిక. కొన్నేళ్లుగా దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. శారీరక రుగ్మతలను తొలగించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా ఉంచుతుంది. అశ్వగంధ మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించడానికి పనిచేస్తుంది. అశ్వగంధ మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచడమే కాక మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది. మీరు పాలు, నీరు, తేనె నెయ్యితో కలపడం దీనిని తీసుకోవచ్చు.

తులసి

మూలికలలో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. తులసి ఆయుర్వేదంలో ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది యాంటీబయాటిక్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తొలగించడానికి పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచడానికి కూడా పనిచేస్తుంది. దీని కోసం మీరు 5 నుంచి 10 తులసి ఆకులు, 5 బాదం, 5 నల్ల మిరియాలు తేనెతో కలిపి తినవచ్చు. ఇది మెమరీ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ధ్యానం 

రెగ్యులర్ ధ్యానం మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. మనస్సును శాంతింపజేస్తుంది. ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను పెంపొందించడానికి తోడ్పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..