ఆరోగ్యానికి మంచి చేసే కూరగాయల్ని మనలో చాలా మంది పొరపాటున కూడా తినం సరికదా.. కనీసం వాటివైపు కన్నెత్తి కూడా చూడం. క్యాబేజీ, కాకరకాయ, పొట్లకాయ, బీన్స్, కాలీఫ్లవర్ వంటి కూరగాయల్ని చాలా మంది ఇష్టపడరు. కానీ వాటిలోనే ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు, మంచి విటమిన్లు ఉంటాయి. కాలీ ఫ్లవర్ లో మీకు తెలియని ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది గ్యాస్, ఎసిడిటీ వంటి వంటి సమస్యల్ని తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుందట.
కాలీ ఫ్లవర్ లో పోషక విలువలు:
-కాలీఫ్లవర్ లో పొటాషియం, క్యాల్షియం, ప్రొటీన్స్, పాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. బరువు తగ్గడంలో కాలీఫ్లవర్ సహాయపడుతుంది.
-శరీరంలో పేరుకున్న కొవ్వులను కరిగించి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
-శరీరంలో పేరుకున్న మలినాలు, విష పదార్థాలు తొలగిపోయి శరీరం శుభ్రమవుతుంది.
-ప్రతిరోజూ ఉదయం కాలీఫ్లవర్ జ్యూస్ తాగితే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాం.
-రక్తహీనతతో బాధపడేవారికి కాలీఫ్లవర్ మంచి ఆహారం. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిల్ని పెంచడంలో కాలీఫ్లవర్ కీలకంగా వ్యవహరిస్తుంది. కాలీఫ్లవర్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. వారానికి రెండుసార్లు కాలీఫ్లవర్ ను ఆహారంలో తీసుకుంటే ఎముకల ఆరోగ్యం బాగుంటుంది.
-హైపర్ థైరాయిడ్ ఉన్నవారు మాత్రం కాలీఫ్లవర్ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దాని వల్ల T3, T4 హార్మోన్లు మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు కూడా కాలీ ఫ్లవర్ ను తినకూడదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి