ఒకే బంతికి ఫోర్, డెడ్‌బాల్, హిట్ వికెట్

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఇదొక ట్విస్ట్… 176 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు విజయానికి చివరి 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో బౌలింగ్‌కి వచ్చిన ఆండ్రీ రస్సెల్ ఓవర్‌లో.. నాలుగో బంతిని గాల్లోకి లేపి 17 ఏళ్ల యువ హిట్టర్ రియాన్ పరాగ్ (47: 31 బంతుల్లో 5×4, 2×6) కళ్లు చెదిరే‌రీతిలో సిక్స్‌గా మలిచాడు. దీంతో.. తర్వాత బంతిని రసెల్‌ […]

ఒకే బంతికి ఫోర్, డెడ్‌బాల్, హిట్ వికెట్
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 5:24 PM

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఇదొక ట్విస్ట్… 176 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు విజయానికి చివరి 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో బౌలింగ్‌కి వచ్చిన ఆండ్రీ రస్సెల్ ఓవర్‌లో.. నాలుగో బంతిని గాల్లోకి లేపి 17 ఏళ్ల యువ హిట్టర్ రియాన్ పరాగ్ (47: 31 బంతుల్లో 5×4, 2×6) కళ్లు చెదిరే‌రీతిలో సిక్స్‌గా మలిచాడు. దీంతో.. తర్వాత బంతిని రసెల్‌ షార్ట్ పిచ్‌ రూపంలో సంధించగా.. పరాగ్.. ఫైన్‌లెగ్ దిశగా ఫుల్ చేశాడు. కానీ ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి వికెట్లను బ్యాట్‌తో తాకించేశాడు. మరోవైపు అతను కొట్టిన బంతి నేరుగా బౌండరీకి వెళ్లిపోయింది.

పరాగ్ హిట్ వికెట్‌గా ఔటైనా.. అంపైర్ ఇయాన్ గౌల్డ్ ఏమరుపాటులో… బంతి బౌండరీకి వెళ్లడంతో తొలుత ఫోర్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ తర్వాత బెయిల్స్ పడి ఉండటాన్ని చూసి.. బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తూ నిర్ణయం మార్చాడు. కానీ.. హిట్ వికెట్‌గా ఔటయ్యానంటూ పరాగ్ పెవిలియన్‌కి వెళ్లిపోతుండటంతో.. అప్పుడు తీరిగ్గా అంతిమ నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌కి నివేదించాడు. ఆయన కూడా పరాగ్  ఔటైనట్టు ప్రకటించాడు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో