ప్రభాస్‌ ‘ఆదిపురుష్’‌.. లక్ష్మణుడిగా దక్షిణాది యంగ్ హీరో..!

రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న పౌరాణిక భారీ బడ్జెట్‌ చిత్రం ఆదిపురుష్‌. రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న

ప్రభాస్‌ ఆదిపురుష్‌.. లక్ష్మణుడిగా దక్షిణాది యంగ్ హీరో..!

Edited By:

Updated on: Sep 21, 2020 | 1:04 PM

Prabhas Adipurush movie: రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న పౌరాణిక భారీ బడ్జెట్‌ చిత్రం ఆదిపురుష్‌. రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సైఫ్‌ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ క్రమంలో మిగిలిన పాత్రల్లో ఎవరు నటిస్తున్నారన్న చర్చ ఫిలింనగర్‌ వర్గాల్లో జరుగుతుంది. దీంతో పలు పాత్రలకు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక ఈ మూవీని తెలుగు, హిందీలో ఏకకాలంలో తెరకెక్కిస్తుండగా.. మిగిలిన భారతీయ భాషల్లో కూడా డబ్‌ అవ్వనుంది. దీంతో ఇటు దక్షిణాది, అటు ఉత్తరాదిలో పేరు మోసిన నటులను ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో రాముడి తమ్ముడి పాత్ర లక్ష్మణుడి పాత్రలో దక్షిణాది యంగ్ హీరో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం. ఇక 3డీలో తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్. అలాగే సీత పాత్రకు అనుష్క శర్మను ఫైనల్ చేసినట్లు సమాచారం. కాగా టీసిరీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

Read More:

షాకింగ్‌.. లక్షణాలు లేని వారిలోనే వైరస్ లోడు అధికం

Bigg Boss4: దేవికి షాకిచ్చిన కరాటే కళ్యాణి