Yami Gautham: నూతన సంవత్సరం బిజీగా మారిపోయిన ఫెయిర్ బ్యూటీ.. తాజాగా ‘పింక్’ డైరెక్టర్‌తో మరో ప్రాజెక్ట్‌కు ..

Yami Gautham: ఫెయిర్ బ్యూటీ యామీ గౌతమ్‌కు నూతన సంవత్సరంలో దూసుకెళుతుంది. భారీ ప్రాజెక్ట్స్ చేపట్టి బిజీగా మారిపోయింది.

Yami Gautham: నూతన సంవత్సరం బిజీగా మారిపోయిన ఫెయిర్ బ్యూటీ.. తాజాగా ‘పింక్’ డైరెక్టర్‌తో మరో ప్రాజెక్ట్‌కు ..

Edited By:

Updated on: Jan 11, 2021 | 1:17 PM

Yami Gautham: ఫెయిర్ బ్యూటీ యామీ గౌతమ్‌కు నూతన సంవత్సరంలో దూసుకెళుతుంది. భారీ ప్రాజెక్ట్స్ చేపట్టి బిజీగా మారిపోయింది. ఇప్పటికే యామీ ‘బూత్ పోలీస్, ఏ ఫ్రైడే, దస్వి’ లాంటి బిగ్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టగా కొత్తగా మరో ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. ‘పింక్’ డైరెక్టర్ అనిరుద్ధ రాయ్ చౌదరీ డైరెక్షన్‌లో వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సోషల్ డ్రామాగా తెరకెక్కనున్న సినిమాకు మూవీ యూనిట్ ‘ఫరార్‌’ అనే టైటిల్‌‌ను కూడా ఫైనల్ చేసింది.

మీడియా అండ్ క్రైమ్ జర్నలిజం చుట్టూ తిరిగే కథలో యామీ కీ రోల్ ప్లే చేయబోతుండగా మే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. చేతినిండా ప్రాజెక్ట్‌లతో యామీ సంవత్సరం పొడగునా షూటింగ్‌లో పాల్గొంటుంది కాబోలు. ఇక అనిరుద్ధ రాయ్ చౌదరీ డైరెక్షన్‌లో వచ్చిన హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ ‘పింక్’ గురించి తెలిసిందే. ‘అది భర్త అయినా సరే భార్య సమ్మతి లేనిదే శృంగారం చేయరాదు’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా. సమాజంలో కొంత మార్పు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఈ సినిమానే తాప్సీ కెరియర్‌ను మలుపు తిప్పగా ఇప్పుడు అదే డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘ఫరార్’ మూవీ యామీ కెరియర్‌‌కు బూస్టప్ ఇస్తుందా? చూడాలి మరి. పింక్‌ లాగే ఈ సినిమా కూడా విజయవంతమైతే యామీ గౌతమ్ ఇక వెనుదిరిగి చూసుకోనవససరం లేదు.

Kajal Rejects Teja Movie: కాజల్ పోయే తాప్సీ వచ్చే.. తేజ మూవీని రిజెక్ట్ చేసిన చందమామ.. ఎందుకిలా చేసిందంటే..