చెర్రీకి ఫ్రీ.. ఎన్టీఆర్‌కు రిస్ట్రిక్షన్లు..?

| Edited By:

Dec 19, 2019 | 5:57 PM

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. సెట్స్ మీదకు వెళ్లినప్పుడు ఈ మూవీ షూటింగ్‌కు కొన్ని అంతరాయాలు ఏర్పడినా.. ఆ తరువాత అనుకున్న విధంగానే చిత్రీకరణను వేగంగా పూర్తి చేస్తున్నాడు జక్కన్న. రిలీజ్ డేట్ ముందే ప్రకటించడం, ఆ […]

చెర్రీకి ఫ్రీ.. ఎన్టీఆర్‌కు రిస్ట్రిక్షన్లు..?
Follow us on

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. సెట్స్ మీదకు వెళ్లినప్పుడు ఈ మూవీ షూటింగ్‌కు కొన్ని అంతరాయాలు ఏర్పడినా.. ఆ తరువాత అనుకున్న విధంగానే చిత్రీకరణను వేగంగా పూర్తి చేస్తున్నాడు జక్కన్న. రిలీజ్ డేట్ ముందే ప్రకటించడం, ఆ విషయంలో రాజమౌళికి నిర్మాత స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో.. పక్కా ప్రణాళికతో షూటింగ్‌ను పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు ఈ దర్శకధీరుడు. ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్ దాదాపు 70శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. మిగిలిన చిత్రీకరణను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. తరువాత గ్రాఫిక్స్‌పై శ్రద్ధ పెట్టబోతున్నాడట రాజమౌళి.

అయితే తాను సినిమా తీస్తున్నప్పుడు హీరో లుక్‌‌లు బయటకు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు రాజమౌళి. అంతేకాదు ఈ విషయంలో హీరోలకు అతడు చాలా రిస్ట్రిక్షన్లు పెడుతుంటాడని ఫిలింనగర్ టాక్. ఈ నేపథ్యంలో హీరోలు కూడా తమ ఫొటోలు లీక్‌ అవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందుకే బాహుబలి సమయంలో ప్రభాస్ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు బయటకు రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు చెర్రీని మాత్రం చాలా ఫ్రీగా వదిలేశాడు రాజమౌళి. ఆర్ఆర్‌ఆర్‌లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోనన చెర్రీ.. ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే.. బయట కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సైరా ప్రమోషన్ల సమయంలో యాక్టివ్‌గా పాల్గొన్నాడు చెర్రీ. ఆ తరువాత కూడా ఇటీవల సానియా మీర్జా సోదరి వివాహం, దబాంగ్ ప్రమోషన్లు.. ఇలా పలు వాటిలో చెర్రీ తన అభిమానులకు దర్శనమిచ్చాడు. దీంతో ఆర్ఆర్ఆర్‌లో అతడి లుక్ మొత్తం దాదాపుగా రివీల్ అయిపోయింది.

కానీ మరోవైపు ఎన్టీఆర్‌కు జక్కన్న పూర్తి రిస్ట్రిక్షన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తుండగా.. ఆయన బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్టీఆర్ మీడియాకు దూరంగానే ఉంటున్నారు. దీంతో అతడి లుక్‌పై అందరిలో ఆసక్తి ఎక్కువగా ఉంది. (కానీ లీక్ రాయుళ్ల వలన ఆయన లుక్స్ బయటకు వచ్చాయి. వాటిని పక్కనపెడితే ఎన్టీఆర్ లుక్‌ అంతగా రివీల్ అవ్వలేదు). ఏదేమైనా సినిమా విషయంలో పక్కాగా ఉండే జక్కన్న.. చెర్రీని ఫ్రీగా వదిలేసి, ఎన్టీఆర్‌కు రిస్ట్రిక్షన్లు పెట్టడంపై వెనుక స్ట్రాటెజీ ఏంటో ఆయనకే తెలియాలి. ఇక దాదాపు రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.