గొల్లపూడి మృతి.. ‘మా’.. ఎందుకింత చిన్నచూపు..!

| Edited By: Ram Naramaneni

Dec 17, 2019 | 10:02 PM

మూవీ ఆర్టిస్ట్‌ల సంక్షేమం కోసం పుట్టిన మా(మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఇప్పుడు పలు వివాదాల్లో మునిగి తేలుతుంది. బయటి రాజకీయాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆ అసోషియేషన్‌లో పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు హడావిడి చేయడం తప్ప.. ఆర్టిస్ట్‌ల గురించి మా పెద్దగా పట్టించుకోవడం లేదు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇప్పుడు మా సభ్యులు చిన్న చూపు చూస్తున్నారు. ఈ విషయం తాజగా మరోసారి బయట పడింది. ప్రముఖ సీనియర్ […]

గొల్లపూడి మృతి.. మా.. ఎందుకింత చిన్నచూపు..!
Follow us on

మూవీ ఆర్టిస్ట్‌ల సంక్షేమం కోసం పుట్టిన మా(మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఇప్పుడు పలు వివాదాల్లో మునిగి తేలుతుంది. బయటి రాజకీయాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆ అసోషియేషన్‌లో పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు హడావిడి చేయడం తప్ప.. ఆర్టిస్ట్‌ల గురించి మా పెద్దగా పట్టించుకోవడం లేదు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇప్పుడు మా సభ్యులు చిన్న చూపు చూస్తున్నారు. ఈ విషయం తాజగా మరోసారి బయట పడింది.

ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు ఇటీవల తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణం టాలీవుడ్‌కు తీరని లోటు అంటూ పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. అయితే ఆయనకు వీడ్కోలు పలికేందుకు, నివాళులు అర్పించేందుకు మా అసోషియేషన్‌ నుంచి ఒక్కరు కూడా చెన్నైకి వెళ్లకపోవడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు సినీ రంగంలో సుధీర్ఘ కాలం సేవలు అందించిన ఓ సీనియర్ నటుడికి ఇదేనా గౌరవం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతికున్నప్పుడు అటుంచితే.. చనిపోయిన మనిషికి ఇదేనా ఇచ్చే గౌరవమంటూ కొంతమంది కామెంట్లు వినిపిస్తున్నారు. ఏదేమైనా అంతర్గత కుమ్ములాటలతో ఇటీవల మా ప్రతిష్టకు భంగం కలగగా.. ఇప్పుడు ఈ చర్యతో ఆ అసోషియేషన్ పరువు మరింత దిగజారిందని కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.