3 / 5
భారతదేశపు రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చిరంజీవికి ప్రకటించడంతో ఆయన అభిమానులే కాదు.. యావత్ తెలుగు ప్రజలు పండగ చేసుకుంటున్నారు. కొన్నిరోజుల కిందే ఈ న్యూస్ బయటికి వచ్చినా.. అఫీషియల్‌గా ఇప్పుడు అనౌన్స్ చేసారు. చిరంజీవితో పాటు వైజయంతి మాల, వెంకయ్య నాయుడు, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ ఇచ్చారు.