Youtuber Harsha Sai: గట్టు దాటాడా..? యూట్యూబర్ హర్షసాయి ఎక్కడ.. వారంతా సైలెంట్ మోడ్‌లోకి ఎందుకెళ్లారు..

|

Oct 06, 2024 | 7:44 AM

లైంగిక దాడి, బ్లాక్‌మెయిలింగ్‌ కేసులో యూట్యూబర్‌ హర్షసాయి కోసం నార్సింగి పోలీసులు ఇంకా సెర్చ్‌ చేస్తున్నారు. లేటెస్ట్‌గా బాధితురాలు మరో ఫిర్యాదు చేశారు. ఇక ఆడియో లీకుల వ్యవహారం లీగల్‌గా మరో టర్న్‌ తీసుకుంది.

Youtuber Harsha Sai: గట్టు దాటాడా..? యూట్యూబర్ హర్షసాయి ఎక్కడ.. వారంతా సైలెంట్ మోడ్‌లోకి ఎందుకెళ్లారు..
Harsha Sai
Follow us on

లైంగిక దాడి.. అండ్‌ బ్లాక్‌మెయిలింగ్‌ కేసులో యూట్యూబర్‌ హర్షసాయి కోసం నార్సింగి పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. జాడ కనుగునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో యూ ట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మరో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ యూ ట్యూబర్‌ హర్షసాయి ఎక్కడ? దేశంలోనే ఉన్నాడా? గట్టు దాటాడా? అసలు హర్షసాయి కేసులో పురోగతి ఏంటి?.. అనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే.. విదేశాలకు పారిపోయినా సరే హర్షసాయి అరెస్ట్‌ తప్పదన్నారు బాధితురాలి తరపు న్యాయవాది నాగూర్‌ బాబు. ఇక నిందితురాల్ని డిఫేమ్‌ చేసేలా హర్షసాయి అతని మనుషులు రిలీజ్ చేసిన ఫ్యాబ్రికేటెడ్‌ ఆడియోలపై కోర్టును ఆశ్రయించామన్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి వాటిని తొలిగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు డైరెక్షన్‌ ప్రకారం సైబర్‌ క్రైమ్‌ సెక్షన్ల కింద పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయిందన్నారు నాగూర్‌బాబు. తన క్లయింట్‌పై ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు హర్షసాయి ప్లాన్‌లో భాగమని న్యాయవాది నాగూర్‌బాబు తెలిపారు.

కేసులో నిందితుడిగా చేర్చకపోయినా సరే హర్షసాయి తండ్రి బెయిల్‌ కోసం ప్రయత్నించాడన్నారు నాగూర్‌బాబు. దీంతో కోర్టు అతన్ని మందలించిందన్నారు. హర్షసాయి కోసం పోలీసులు లుక్‌ ఔట్‌ నోటీస్‌ జారీ చేశారని.. అరెస్ట్ తప్పదంటూ పేర్కొన్నారు.

ఇదీ బాధితురాలి సైడ్‌ నుంచి తెరపైకి వచ్చిన వెర్షన్‌. మరి హర్షసాయి స్పందన ఏంటి? తప్పు చేయకపోతే తప్పించుకు తిరగడం ఎందుకు? హర్షసాయికి వత్తాసు పలికిన కొందరు యూ ట్యూబర్‌ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ ఎందుకు గాయబ్‌ అయినట్టు? అనే చర్చ జరుగుతోంది. వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది..

అప్పటినుంచి పరారీలోనే..

కాగా.. యూట్యూబర్ హర్షసాయిపై గత నెలలో అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారం చేశాడని, నగ్న వీడియోలు, ఫొటోలు చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తునన్నాడంటూ ఓ సినీ నటి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. అపన్పటినుంచి హర్షసాయి పరారీలోనే ఉన్నాడు..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..