సోనూసూద్ జాబ్ పోర్టల్‌తో కలిసి పనిచేస్తాం..నిరుద్యోగులకు అండగా నిలుస్తాం.. వెల్లడించిన గుడ్ వర్కర్..

|

Nov 26, 2020 | 4:24 PM

కరోనా కాలంలో కష్టం ఎవరికొచ్చినా మొదట గుర్తుకు వచ్చే పేరు సోనూసూద్. ఎందుకంటే లాక్‌డౌన్‌లో ఎంతో మందికి సాయం చేశాడు. మరెందరికో అండగా నిలిచాడు.

సోనూసూద్ జాబ్ పోర్టల్‌తో కలిసి పనిచేస్తాం..నిరుద్యోగులకు అండగా నిలుస్తాం.. వెల్లడించిన గుడ్ వర్కర్..
Follow us on

కరోనా కాలంలో కష్టం ఎవరికొచ్చినా మొదట గుర్తుకు వచ్చే పేరు సోనూసూద్. ఎందుకంటే లాక్‌డౌన్‌లో ఎంతో మందికి సాయం చేశాడు. మరెందరికో అండగా నిలిచాడు. అంతేకాకుండా లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన వారి కోసం ఏకంగా ఇండియాలోని ప్రైవేట్ కంపెనీలతో కలిసి ప్రవాసి రోజ్‌గార్ పేరిట ఓ జాబ్ పోర్టల్ స్థాపించాడు. కంపెనీలకు, నిరుద్యోగులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. దీనిని గుర్తించిన ఓ కార్పొరేట్ కంపెనీ ఇందులో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది.

సోనూసూద్ కంపెనీ, ఒకేషనల్ స్కిల్ ప్రొవైడర్ స్కూల్‌నెట్ రెండు కలిసి టెమా‌సెక్ బ్యాక్డ్ జాబ్ మ్యాచింగ్ ప్లాట్ పాం గుడ్‌వర్కర్‌తో కలిసి ఓ జాయింట్ వెంచర్‌ని ప్రారంభించబోతున్నాయి. ఇందులో గుడ్‌వర్కర్‌ రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్దమైంది. ఫైనాన్స్‌, హెల్త్‌కేర్‌, సోషల్‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఇది ఉపాధి కల్పించనుంది. వచ్చే ఏడాది లాంఛనంగా పనులు ప్రారంభిస్తారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనే తన కోరిక ఈ జాయింట్ వెంచర్ ద్వారా తీరబోతుందని సోనూసూద్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఉపాధి అవకాశాలే కాకుండా వాటికి కావలసిన శిక్షణ కూడా అందిస్తామని పేర్కొన్నారు. అయితే నాలుగు నెలల కాలంలోనే సోన్ సూద్ స్థాపించిన ప్రవాసి రోజ్‌గార్ యోజనలో పది లక్షల మంది తమ వివరాలను పొందుపరుచుకోవడం విశేషం.