Kalki 2898 AD: స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన వైజయంతీ మూవీస్‌.. కల్కి విషయంలో ఆ తప్పు చేస్తే..

|

Sep 22, 2023 | 8:36 AM

ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. కామికాన్‌ వేదికగా విడుదల ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. హాలీవుడ్‌ స్థాయిలో ఈ చిత్రాన్ని నాగ అశ్విన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయమని భావిస్తున్న ఈ సినిమా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది...

Kalki 2898 AD: స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన వైజయంతీ మూవీస్‌.. కల్కి విషయంలో ఆ తప్పు చేస్తే..
Kalki 2898 Ad
Follow us on

ప్రభాస్‌ హీరోగా కల్కీ 2898 ఏడీ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు పార్ట్స్‌లో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లానింగ్ చేస్తుంది. అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటానీ, దీపిక పదుకొణె వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. కామికాన్‌ వేదికగా విడుదల ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. హాలీవుడ్‌ స్థాయిలో ఈ చిత్రాన్ని నాగ అశ్విన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయమని భావిస్తున్న ఈ సినిమా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి లీకుల బెడద కూడా వెంటాడుతోంది.

సైన్స్‌ ఫిక్షన్ థ్రిల్లర్‌ వస్తున్న క్కలి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్‌ సోషల్‌ మీడియాలో లీక్‌ అయినట్లు ఇటీవల కొన్ని వార్తలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన సీన్స్‌ లీక్‌ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్‌ దీనిపై స్ట్రాంగ్‌గా స్పందించింది. ఈ విషయంలో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. లీక్‌ల విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న చిత్ర యూనిట్‌ కల్కికి సంబంధించి ఎలాంటి లీకులు బయటకు వచ్చినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

వైజయంతీ మూవీస్ ట్వీట్..

ఈ విషయమై వైజయంతీ మూవీస్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేసింది. ఈ విషయమై ట్వీట్‌ చేస్తూ.. ‘కల్కి చిత్రానికి చెందిన అన్ని హక్కులు నిర్మాణ సంస్థకు మాత్రమే చెందుతాయి. ఫొటోలు, వీడియోలు లీక్‌ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అలాగే అన్‌ అఫిషియల్‌గా బయటకు వచ్చిన వాటిని షేర్‌ చేసిన చర్యలు తీసుకుంటాము’ అని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే కల్కి లీక్‌కు సంబంధించి చిత్ర యూనిట్‌ ఇప్పటికే లీగల్‌గా యాక్షన్‌ తీసుకున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..