Vishnu Vishal, Jwala Gutta : డేటింగ్‌‌కు గుడ్‌బై.. వేదమంత్రాల మధ్య ఒక్కటైన జ్వాల గుత్తా, విష్ణు విశాల్‌

Vishnu Vishal, Jwala Gutta Marriage: భారత బ్మాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌ ఒక్కటయ్యారు. గురువారం మధ్యాహ్నం వీరిద్దరు వివాహం చేసుకున్నారు.

Vishnu Vishal, Jwala Gutta : డేటింగ్‌‌కు గుడ్‌బై.. వేదమంత్రాల మధ్య ఒక్కటైన జ్వాల గుత్తా, విష్ణు విశాల్‌
Vishnu Vishal And Jwala Gutta

Updated on: Apr 22, 2021 | 5:32 PM

Vishnu Vishal, Jwala Gutta Marriage: భారత బ్మాడ్మింటన్‌ ప్లేయర్‌  జ్వాల గుత్తా, తమిళ హీరో విష్ణు విశాల్‌ ఒక్కటయ్యారు. గురువారం మధ్యాహ్నం వీరిద్దరు వివాహం చేసుకున్నారు. కరోనా కారణంగా అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గత ఏడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. ఉగాది పర్వదినాన తమ లగ్న పత్రికను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అయితే కోవిడ్‌ కారణంగా అదరికి ఆహ్వానాలు పంపడం లేదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, వీరిద్దరిదిర రెండో పెళ్లి. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్‌ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఇక భారత్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను 2005లో వివహం చేసుకున్న జ్వాల .. 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఇక విశాల్‌ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం కాస్త ప్రేమగా మరి పెళ్లి వరకు వెళ్లింది.

కాగా, కుటుంబ సంప్రదాయాలను పాటిస్తూ జ్వాలా మెడలో విష్ణు విశాల్ మూడుమూళ్లు వేశారు. ఈ సందర్భంగా వారిద్దరికి స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు అందజేశారు. అయితే వివాహ వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 21వ తేదీన జ్వాలా ఇంటిలో మెహందీ, హల్దీ ఫంక్షన్ జరిగింది. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆనందోత్సవాల మధ్య కుటుంబ సభ్యులు జ్వాలా ఒంటికి పసుపు పట్టించి మంగళస్నానం చేయించారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో సంతోషంగా జ్వాలా కనిపించింది.

ఇవీ చదవండి: Superstar Mahesh Babu టాలీవుడ్‌లో కరోనా కలకలం… సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు..!

భార్గవ్ అమ్మాయిలను గౌరవించడు.. అతనో వుమెనైజర్.. షాకింగ్ విషయాలు చెప్పిన మరో అమ్మాయి..