Vishal Chakra Movie Update: ప్రస్తుతం యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ.. సినీ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే చిరు, బాలయ్య, వెంకీ, రామ్ చరణ్, ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందురూ హీరోలు తమ మూవీస్ రిలీజ్ డేట్లను ప్రకటించారు. తాజాగా హీరో విశాల్ కూడా తన సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించాడు.
విశాల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘చక్ర’. ఈ సినిమాకు ఎం.ఎస్ ఆనందన్ దర్శకత్వం వహిస్తుండగా.. జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసండ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అటు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేరోజు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ఫిబ్రవరి 19న ఈ మూవీని విడుదల చేయనున్నట్లుగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది చిత్రయూనిట్. గతంలో ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల థియేటర్లో విడుదలైన మాస్టర్ మూవీ మంచి కలెక్షన్లు రాబట్టడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. సైబర్ క్రైం ఎంటర్ టైనర్గా రాబోతున్న సినిమాపై అంచనాలు భారీగానే పెట్టుకున్నారు అభిమానులు.
Yes, it’s confirmed…
We have planned to release our action thriller film #Chakra in theatres on February 19th in all 4 South Indian Languages. Going to be a grand release. Looking forward to it… GB— Vishal (@VishalKOfficial) February 1, 2021
Also Read:
డిఫరెంట్ లుక్లో కనిపించనున్న నాని.. ఆ సినిమా కోసం మేకోవర్ అవుతున్న నేచురల్ స్టార్..