అది నీ చిన్నప్పటి ఫోటోనా..?: క్యా బాత్ హై కోహ్లీ!

| Edited By: Srinu

Jun 18, 2019 | 6:29 PM

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ ట్విటర్‌లో తన చిన్నప్పటి ఫోటో షేర్ చేశాడు. అప్పటికి ఇప్పటికి ఒకేలా ఫోజు పెట్టి దిగిన ఆ ఫోటో ఇప్పుడు అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం పాక్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం కారణంగా మ్యాచ్‌కి […]

అది నీ చిన్నప్పటి ఫోటోనా..?: క్యా బాత్ హై కోహ్లీ!
Follow us on

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ ట్విటర్‌లో తన చిన్నప్పటి ఫోటో షేర్ చేశాడు. అప్పటికి ఇప్పటికి ఒకేలా ఫోజు పెట్టి దిగిన ఆ ఫోటో ఇప్పుడు అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం పాక్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. ఈ సందర్భంలో వర్షం కోసం ఎదురుచూసే ఫోజిచ్చాడు విరాట్ కోహ్లీ. అందులో నడుము పై చేతులు ఆనించి మబ్బుల వైపు చూస్తున్న ఫోటోతో పాటు.. తన చిన్నప్పటి అదే ఫోజుతో ఉన్న మరో ఫొటోని జతచేశాడు. 1990ల నాటి నుంచి ఇదే చేస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు.