AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పీడు పెంచిన సీనియర్స్.. సమ్మర్‌ని పట్టించుకోరా ??

స్పీడు పెంచిన సీనియర్స్.. సమ్మర్‌ని పట్టించుకోరా ??

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 8:01 PM

Share

దక్షిణాది సినీ పరిశ్రమలో సీనియర్ హీరోల జోరు తగ్గడం లేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో పాటు రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్ర నటులు ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త ప్రాజెక్ట్‌లు ప్రకటిస్తూ, నిరంతరం బిజీగా ఉంటున్నారు. అనుభవం, ఆచరణతో వచ్చే 'సీనియారిటీ'ని నిరూపిస్తూ, ఈ తారలు యువ తరానికి స్ఫూర్తినిస్తున్నారు. వారి అంకితభావం, పనితీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సీనియర్స్ అనే పేరు జస్ట్ ఇయర్స్ పాస్‌ అవుతున్నకొద్దీ వచ్చేయదు. అనుభవంతో వస్తుంది. మన ఆచరణనను బట్టి వస్తుంది. ఎదుటివారికి ఎంత ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నామన్నదాన్నిబట్టి వస్తుంది. అలా వచ్చినదాన్ని అంతే ఇష్టంగా కాపాడుకుంటున్నారు సీనియర్లు. జస్ట్ మన దగ్గరే కాదు.. అన్ని ఇండస్ట్రీల్లోనూ స్పీడు పెంచేశారు సీనియర్లు… ఓ వైపు విశ్వంభర పనులు చేస్తూనే మరోవైపు బాబీ సినిమా కోసం ప్రిపరేషన్‌ మొదలుపెట్టేశారు మెగాస్టార్‌. మొన్న మొన్నటిదాకా మనశంకరవరప్రసాద్‌గారు సినిమా సక్సెస్‌ జోష్‌లో ఉన్న ఆయన నెక్ట్స్ ఏంటనే విషయం మీద ఫుల్‌ క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు గోపీచంద్‌ మలినేనితో సినిమా చేస్తు్న్న బాలయ్య కూడా నెక్స్ట్ ప్రాజెక్టుల మీద ఫుల్‌ క్లారిటీతో ఉన్నారు.వెంకటేష్‌ అయితే అసలు ఖాళీ లేదు. కింగ్‌ నాగార్జున 100వ సినిమా కోసం బిజీగా ఉన్నారు. మన హీరోలే కాదు, అటు తమిళనాడులోనూ సీనియర్‌ హీరోల స్పీడు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం జైలర్‌ సీక్వెల్‌ పనులతో బిజీగా ఉన్న రజనీకాంత్‌ ఆగస్టు నుంచి కొత్త సినిమా పనుల్లో మునిగిపోతారు.కమల్‌హాసన్‌ అయితే ఇంకా క్లారిటీగా ఉన్నారు. ఓ వైపు నిర్మాణం, మరోవైపు హీరోగా సినిమా, ఇంకో వైపు కల్కి2.. క్షణం తీరిక లేదు కమల్‌ హాసన్‌కి. అటు మలయాళ అగ్ర హీరోలు మోహన్‌లాల్‌, మమ్ముట్టి పరిస్థితి చెప్పనవసరం లేదు. సినిమా వెంటే సినిమా అంటూ ఒక్క కాల్షీట్‌ను కూడా వేస్ట్ చేయకుండా చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. హీరోలు అంత స్పీడు మీదున్నప్పుడు వారికి తగ్గ కంటెంట్‌తో సెట్లో హాజర్‌ కావాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో కనిపిస్తున్నారు కెప్టెన్లు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Biker Collection: బాక్సాఫీస్‌ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్

Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట

Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక

Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది

Follow Us