AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాహుబలి బాటలో ధురంధర్.. బన్నీ,యష్ ఫాలో అవుతారా ??

బాహుబలి బాటలో ధురంధర్.. బన్నీ,యష్ ఫాలో అవుతారా ??

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 7:59 PM

Share

'బాహుబలి ది ఎపిక్' విజయం తర్వాత, ధురంధర్‌, కేజీఎఫ్‌, కాంతార, పుష్ప వంటి పాన్-ఇండియా చిత్రాల భాగాలను కలిపి ఒకే చిత్రంగా విడుదల చేయవచ్చా అనే చర్చ ఊపందుకుంది. బాహుబలి రన్‌టైమ్ సాహసం స్ఫూర్తిగా, ఈ సినిమాల మేకర్స్ ఎందుకు ఈ ప్రయోగానికి ముందుకు రావడం లేదు? ప్రేక్షకులు, విమర్శకుల అభిప్రాయాలు, భవిష్యత్ నిర్ణయాలపై విశ్లేషణ.

బాహుబలికి కుదిరింది కదా.. అని ఇప్పుడు ధురంధర్‌ని క్లబ్‌ చేస్తామంటే కుదురుతుందా? అలా కుదిరే పని అయితే.. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఆ మిగిలిన సినిమాలు కూడా ఆ బాటలోనే ట్రావెల్‌ చేసి ఉండేవి కదా…ఒకవేళ ఇప్పటిదాకా చేయని ఆలోచనని ఇకమీదట చేస్తారా? బాహుబలి బాటలో ధురంధర్‌ నడిస్తే.. బన్నీ, యష్‌ ఫాలో కావడానికి రెడీయేనా? కమాన్‌ లెట్స్ వాచ్‌.. బాహుబలి రెండు పార్టులనూ కలిపి బాహుబలి ది ఎపిక్‌ అని రిలీజ్‌ చేస్తామని రాజమౌళి చెప్పినప్పుడు వావ్‌.. జక్కన్న చర్యలు ఊహాతీతం అని సంబరపడిపోయారు. మరి రెండు పార్టులు కలిపితే అంత నిడివి చూడగలమా? అని కూడా అనుకున్నారు. అతి కష్టం మీద తానొక రన్‌టైమ్‌ అనుకుని ఫిక్సయ్యారు జక్కన్న. అది అప్పటి సంగతి. ధురంధర్‌ రిలీజ్‌ అయ్యాక రన్‌టైమ్‌ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. బాహుబలిని క్లబ్‌ చేసినట్టు ధురంధర్‌ని క్లబ్‌ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏడు గంటలైనా వస్తుంది కదా? ఎంత కాదనుకున్నా నాలుగైదు గంటలకు తగ్గే ప్రసక్తే లేదుగా.. అని మాటలు మొదలయ్యాయి. ఒకవేళ క్లబ్‌ చేసి రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుందోననే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికైతే మేకర్స్ నుంచి ఈ ముచ్చట లేదుగానీ, సినీ ప్రియుల్లో మాత్రం చర్చ జోరందుకుంది. అది సాధ్యమయ్యే పనే అయితే కేజీయఫ్‌ మేకర్స్ ఎందుకు కామ్‌గా ఉన్నట్టు? నేషనల్‌ వైడ్‌ కన్నడ ఇండస్ట్రీకి గుర్తింపు తెచ్చిన సినిమా కేజీయఫ్‌. రాకీభాయ్‌ విన్యాసాలను సింగిల్‌ పార్టులో చూడ్డానికి కన్నడిగులే కాదు… ప్యాన్‌ ఇండియా ఆడియన్స్ కూడా రెడీ. కాంతార విషయంలోనూ ఇదే క్యూరియాసిటీ ఉంది. కానీ ఎందుకే క్లబ్‌ చేయడానికి మేకర్స్ మాత్రం ముందుకు రావడం లేదు. బాహుబలి ది ఎపిక్‌ వచ్చినప్పుడు మన పుష్పరాజ్‌ని కూడా ఎట్‌ ఎ స్ట్రెచ్‌ చూపించేస్తే బావుంటుందనే అభిప్రాయాలు వినిపించాయి. అది సాధ్యమయ్యే విషయమే అనే మాట కూడా నడిచింది. కానీ త్రీక్వెల్‌ ఉండటం వల్లనో, మరో కారణం చేతనో.. ఆ మాటలు అక్కడితో ఆగిపోయాయి. చూద్దాం.. నియర్‌ ఫ్యూచర్‌లో ధురంధర్‌ మేకర్స్ తీసుకునే డెసిషన్‌.. ప్రేక్షకుల ఆదరణ.. మరెన్ని ప్రయోగాలకు దారి తీస్తుందో అంటున్నారు క్రిటిక్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Biker Collection: బాక్సాఫీస్‌ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్

Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట

Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక

Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది

Follow Us