
తమిళ సూపర్ స్టార్ యంగ్ హీరో విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమా వరుస రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా మాళవికా మోహనన్ నటిస్తుంది. ఈ చిత్రానికి లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే విజయ్ నటిస్తున్న మాస్టర్ మూవీపై ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమాను తమిళ్, తెలుగు భాషలతోపాటు పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ రెడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సెన్సెషనల్ రికార్డులను సృష్టిస్తుంది. తాజాగా ఈ టీజర్ సౌత్ ఇండస్ట్రీలోనే రెండో 50 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్ టీజర్‌గా నిలిచింది. ఇంతకు ముందు విజయ్ నటించిన బిగిల్ టీచకర్ కూడా 50 మిలియన్ వ్యూస్ అందుకుంది. దీంతో రెండు సినిమా టీజర్లు 50 మిలియన్ వ్యూస్‌కు పైగా టీజర్లు ఉన్న హీరోగా విజయ్ సౌత్ ఇండస్ట్రీలోనే రికార్ట్ సెట్ చేసాడు. చిత్రం విడుదలకు ముందే టీజర్ అంచనాలను భారీగా పెంచేస్తోంది. ఈ సినిమాలో విలన్‌గా మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో విజయ్ నటించిన బిగిల్ సినిమాను తెలుగులో విజిల్‌గా విడుదల చేసిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ వారే మళ్ళీ ఈ మూవీని విడుదల చేయనున్నారు.