AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pongal 2021 Movie Releases: ఆకలితో ఉన్నారు కదా..సంక్రాంతికి ఫుల్ మీల్స్ రెడీ…పొంగల్ బరిలోని బాక్సాఫీస్ పందెం కోళ్లు ఇవే

కరోనా కారణంగా ఎప్పడో మార్చిలో లాక్ డౌన్ విధించారు. అప్పట్నుంచి ప్రపంచం స్తంభించిపోయింది. కంపెనీలు, ఆఫీసులు షట్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. అదే క్రమంలో సినిమా థియేటర్స్ కూడా మూతబడ‌్డాయి.

Pongal 2021 Movie Releases:  ఆకలితో ఉన్నారు కదా..సంక్రాంతికి ఫుల్ మీల్స్ రెడీ...పొంగల్ బరిలోని బాక్సాఫీస్ పందెం కోళ్లు ఇవే
Ram Naramaneni
|

Updated on: Dec 26, 2020 | 5:11 PM

Share

కరోనా కారణంగా ఎప్పడో మార్చిలో లాక్ డౌన్ విధించారు. అప్పట్నుంచి ప్రపంచం స్తంభించిపోయింది. కంపెనీలు, ఆఫీసులు షట్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. అదే క్రమంలో సినిమా థియేటర్స్ కూడా మూతబడ‌్డాయి. దీంతో మూవీ లవర్స్ కొత్త సినిమాలు రిలీజ్ అవ్వక..ఎంతో ఇబ్బంది పడ్డారు. చూసిన సినిమాలనే మళ్లీ..మళ్లీ ఓటీటీలలో చూశారు. తాజాగా ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో థియేటర్స్ మూత పడ్డాయి. సరిగ్గా సంక్రాంతి సమయం కావడంతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి వినోదం ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్  చేసుకున్నాయి. 2021 సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

రెడ్

‘ఇస్మార్ట్ శంకర్’తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్, ఈ సంక్రాంతి పండక్కి ‘రెడ్’ సినిమాతో థియేటర్లలోకి రానున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు.

క్రాక్

మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమ క్రాక్‌. డాన్‌ శీను, బ‌లుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ చిత్రం ఇది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ ఈ చిత్రం తన ఫేట్ మారుస్తుందని నమ్ముతున్నారు. అప్పట్లో వరస ఫ్లాపుల్లో పూర్తిగా గ్రాఫ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని.  తాజాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరి 14న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

అరణ్య

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి నటించిన బహుభాషా చిత్రం అరణ్య కూడా పొంగల్ రేసులో ఉంది.   2021 సంక్రాంతికి అరణ్య చిత్రం రిలీజ్ అవుతోందని రానా స్వయంగా గతంలో వెల్లడించాడు. హిందీలో హాథీ మేరీ సాథీగా తెరకెక్కిన ఈ చిత్రం దక్షిణాది భాషల్లోనూ వస్తోంది. ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించాడు. అయితే పొంగల్ రేసులో ఉన్నా…రిలీజ్ డేట్ పై మాత్రం స్పష్టత లేదు.

మాస్టర్

2020లో అత్యంత క్రేజీగా అభిమానుల్లో ట్రెండ్ అయిన టైటిల్ `మాస్టర్`. దళపతి విజయ్ `సర్కార్` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న సినిమాగా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఖైదీ లాంటి సంచలన విజయంతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో బజ్ రెట్టిపైంది. ఈ క్రేజీ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉన్నట్లు మూవీ యూనిట్ స్పష్టం చేసింది.

బంగారు బుల్లోడు

అల్లరి నరేష్ కూడా సంక్రాంతి రేసులో దిగబోతున్నాడు. తన కామెడీ ఎంటర్టైనర్ బంగారు బుల్లోడుతో పొంగల్ కి రాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. పీవీ గిరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా ఝవేరి కథానాయికగా నటించింది.