బాలీవుడ్ వెబ్ సిరీస్‌‌‌‌‌‌లో విజయ్ సేతుపతి.. ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌‌‌‌లో ఆ స్టార్ హీరో కూడా..

|

Dec 21, 2020 | 6:53 PM

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఇళయదళపతి విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ వెబ్ సిరీస్‌‌‌‌‌‌లో విజయ్ సేతుపతి.. ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌‌‌‌లో ఆ స్టార్ హీరో కూడా..
Follow us on

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఇళయదళపతి విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తో పాటు తెలుగులో ఉప్పెన సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలానే ‘తుగ్లక్ దర్బార్’ ‘కడసాయి వివసాయి’ ‘మామనితనం’ ‘లాభమ్’ ‘యాదుమ్ ఊరే యావరుమ్ కేళిర్’ ‘కాతు వాకుల రెండు కాదల్’ ‘అన్నాబెల్లె సుబ్రహ్మణ్యం’ సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నారని తెలుస్తుంది.

ఇక విజయ్ సేతుపతి డిజిటల్ రంగంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘నవరస’ వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ తోపాటు బాలీవుడ్ లోను ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు సేతుపతి. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో కలిసి విజయ్ సేతుపతి నటిస్తున్నారని సమాచారం. దర్శకులు రాజ్ – కృష్ణ డీకే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు దర్శకులు కలిసి మరో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కలిసి కనిపించనున్నారు. జనవరిలో షూటింగ్ ప్రారంభించి ముంబై – గోవా ప్రాంతాల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎపిసోడ్ లను చిత్రీకరిస్తారని అంటున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి.