టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మరో రెండు రోజుల్లో వరల్డ్ ఫేమస్ లవర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంపై విజయ్ కూడా చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇందులో నాలుగు డిఫరెంట్ పాత్రల్లో దేవరకొండ కనిపించబోతున్నారు.
కాగా నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన విజయ్.. పెళ్లిచూపులుతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఒకసారి ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమాలను పరిశీలిస్తే.. ఒక హిట్టు, ఒక ఫ్లాప్‌గా దేవరకొండ మూవీలు(ద్వారక, అర్జున్ రెడ్డి, ఏ మంత్రం వేశావే, గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్) వచ్చాయి. మధ్యలో కొన్ని సినిమాల్లో కెమెరా అప్పియరెన్స్, చిన్న పాత్రలు చేశారు అది వేరే విషయం. కానీ హీరోగా మాత్రం ఆయన కెరీర్ ఓ హిట్టు, ఫ్లాప్‌గా సాగుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది దేవరకొండ తన ఖాతాలో ఫ్లాప్‌ను వేసుకోగా.. ఇక ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్‌తో హిట్ గ్యారేంటీ అన్న టాక్ నడుస్తోంది. మరి విజయ్‌కు వరల్డ్ ఫేమస్ లవర్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. కాగా ఈ మూవీలో విజయ్ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె నటించగా.. గోపి సుందర్ సంగీతం అందించారు.