భవిష్యత్‌లో నా పిల్లలకు తల్లి.. నయన్‌పై విఘ్నేష్‌ ఆసక్తికర కామెంట్లు..!

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్.. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారా..? త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో.

భవిష్యత్‌లో నా పిల్లలకు తల్లి.. నయన్‌పై విఘ్నేష్‌ ఆసక్తికర కామెంట్లు..!

Edited By:

Updated on: May 11, 2020 | 2:45 PM

గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్.. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారా..? త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో. దానికి తోడు మదర్స్‌ డేను పురస్కరించుకొని నయన్‌ గురించి విఘ్నేష్‌ శివన్‌ చేసిన ట్వీట్లు ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపిన విఘ్నేష్.. మరో ట్వీట్‌లో నయన్‌కు కూడా విష్ చెప్పారు. ఓ బాబును నయన్‌ ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసిన విఘ్నేష్‌.. భవిష్యత్‌లో నా పిల్లలకు కాబోయే తల్లికి హ్యాపీ మదర్స్‌ డే అని ట్వీట్ చేశారు. అంతేకాదు నయన్ తల్లికి సైతం శుభాకాంక్షలు చెబుతూ.. ”ఒక అందమైన బిడ్డను మీరు అద్భుతంగా పెంచారు. లవ్‌ యు సో మచ్. థ్యాంక్యు అమ్ము” అంటూ పేర్కొన్నారు. కాగా విజయ్‌ సేతుపతి, నయనతార నటించిన నానుమ్ రౌడీ దాన్‌ సినిమాకు విఘ్నేష్ శివన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నయన్‌, విఘ్నేష్‌ మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి ఈ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా.. ఈ ఏడాదైనా ఈ జోడీ పెళ్లి పీటలెక్కుతుందేమో చూడాలి.

Read This Story Also: కరోనాకు మందు కనిపెట్టడం అసాధ్యం.!