Edava Basheer : పాట పాడుతూ స్టేజ్ పైనే కుప్పకూలిన సింగర్.. గుండెపోటుతో మృతి..

బషీర్ తన పాఠశాల రోజుల నుంచి పాటలు పాడుతుండేవాడు.. సంగీతంలో అనేక అవార్డులు, బహుమతులు అందుకున్నాడు..

Edava Basheer : పాట పాడుతూ స్టేజ్ పైనే కుప్పకూలిన సింగర్..  గుండెపోటుతో మృతి..
Edava Basheer

Updated on: May 30, 2022 | 10:07 AM

ప్రముఖ మలయాళ నేపథ్య గాయకుడి ఎడవ బషీర్ (78) కన్నుమూశారు.. శనివారం వేదికపై పాట పాడుతూనే ఆయన కూప్పకూలి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు మే 29న కడపకాడ జుమా మసీదులో జరిగాయి.. మే 28న అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్ ఆర్కెస్ట్రా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బషీర్ లైవ్ ప్రదర్శన ఇస్తున్నారు. ప్రముఖ గాయకుడు యేసుదాసు పాడిన మానో హో తుమ్ అనే హిందీ పాటను ఆలపిస్తుండగా.. ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చి.. స్టేజ్ పైనే కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమై ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే బషీర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

బషీర్ తన పాఠశాల రోజుల నుంచి పాటలు పాడుతుండేవాడు.. సంగీతంలో అనేక అవార్డులు, బహుమతులు అందుకున్నాడు.. తిరువనంతపురం జిల్లాలోని వర్కాలలో సంగీతాలయ అనే స్కూల్ ప్రారంభించారు బషీర్. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ దేశాలు, మిడిల్ ఈస్టర్న్ దేశాలు , ఫార్ ఈస్టర్న్ దేశాలలో బషీర్ పాటల ప్రదర్శనిచ్చారు. స్వాతి తిరునాళ్ మ్యూజిక్ అకాడమీ నుంచి అకాడమిక్ డిగ్రీ నాగభూషణం అభ్యసించారు. రఘువంశం అనే సినిమాకు మొదటిసారిగా నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు. ఆల్‌ కేరళ మ్యూజిషియన్స్‌ అండ్‌ టెక్నిషియన్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. బషీర్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ సంతాపం తెలిపారు. నేపథ్య గాయని కెఎస్ చిత్ర కూడా దివంగత గాయకుడికి నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి
Follow Us