
అయితే ప్రస్తుతం తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇక ఈ రోజు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందోనని, తమకు ఈ సంవత్సరం కలిసి వస్తుందో లేదో తెలుసుకోవడానికి పండితులను వద్దకు వెళ్లి జ్యోతిష్య చెప్పించుకోవడం, పంచాంగ శ్రవణం వినడం చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి విశ్వవసు నామ సంవత్సరం డేంజర్ అంటూ సంచలన విషయాలు వెళ్లడించారు. ఆయన ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుపుతూ మరోసారి వైరల్‌గా మారాడు.

ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం విడాకుల కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే? రవి మానవ సంబంధాలపై తీవ్రప్రభావం ఉండొచ్చునని తెలిపారు. ఏప్రిల్,మే నెలలో భూకంపాలు అధికంగా వస్తాయి.

విమాన ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. నేరాలు పెరుగుతాయి, రాజకీయంలో సంచల సంఘటనలు చోటు చేసుకుంటాయి. మహిళలు పదవులు పొందుతారు. సినీరంగంలో కూడా సంచలనాలు జరిగే ఛాన్స్ ఉంది.

గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా డేంజర్ అంటూ షాకింగ్ విషయాలు వెళ్లడించారు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.