టాలీవుడ్ హీరో వెంకటేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం త్వరలోనే బాలీవుడ్ లో రీమేక్ కానుందట. 1991లో వెంకటేష్ హీరోగా చేసిన ‘కూలీ నెంబర్ 1’ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో వెంకటేష్ రోల్ లో యంగ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తుండగా.. టబు పాత్ర కోసం సారా అలీ ఖాన్ ను ఎంపిక చేశారట. రోహిత్ ధావన్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.