విక్టరీ వెంకటేష్ (Venkatesh ).. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ఎఫ్ 3 . వరుణ్ సరసన మెహ్రీన్, వెంకీ సరసన తమన్నా సందడి చేయనున్నారు. గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఎఫ్2కు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడినే దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ కామెడీ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ఎఫ్ 3 పై అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు దర్శక నిర్మాతలు.
ఫన్ పిక్నిక్ కు రెడీగా ఉండండి..
వాలంటైన్స్ డే సందర్భంగా F3 రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసింది చిత్రబృందం. మే27న ప్రపంచవ్యాప్తంగా తమ సినిమాను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ‘ పిల్లలు పరీక్షలు ముగించుకోండి. పెద్దలు సమ్మర్ సందడికి తయారు కండి. ఫన్ పిక్నిక్‌కి డేట్ ఫిక్స్ చేశాం. ఎంతగానో ఎదురుచూస్తోన్న ఫన్ ఫ్రాంఛైజీ విడుదల తేదీలో ఏ మార్పు ఉండదు’ అంటూ ఎఫ్3 కొత్త పోస్టర్‌ను పంచుకుంది. కాగా ఈసినిమాలో నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ ప్రధానపాత్రలు పోషించనున్నారు. సినిమాకు మరింత గ్లామర్ అద్దేందుకు తమన్నా, మెహరీన్‌లకు తోడు సోనాల్ చౌహాన్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు.
పిల్లలు పరీక్షలు ముగించుకోండి?
పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి?ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ !?
No change in date Anymore! ?
Most Awaited FUN Franchise
➡️ #F3Movie ON MAY 27th?#F3OnMay27@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic pic.twitter.com/wf6VeEhaPC— BA Raju’s Team (@baraju_SuperHit) February 14, 2022