నేను సారీ చెప్పను.. నటి డిమాండ్‌పై స్పందించిన నిర్మాత

మూడో పెళ్లి చేసుకున్న నటి వనితా విజయ్‌కుమార్‌ మళ్లీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. పీటర్‌ తనకు విడాకులు ఇవ్వకుండానే వనితాను వివాహం చేసుకున్నాడని ఆయన మొదటి భార్య హెలెన్‌ ఎలిజిబెత్‌ ఆరోపణలు చేశారు.

నేను సారీ చెప్పను.. నటి డిమాండ్‌పై స్పందించిన నిర్మాత
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2020 | 4:24 PM

మూడో పెళ్లి చేసుకున్న నటి వనితా విజయ్‌కుమార్‌ మళ్లీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. పీటర్‌ తనకు విడాకులు ఇవ్వకుండానే వనితాను వివాహం చేసుకున్నాడని ఆయన మొదటి భార్య హెలెన్‌ ఎలిజిబెత్‌ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది వనితాపై విమర్శలు కురిపిస్తున్నారు. వాటికి ఆ నటి సైతం గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే వనితాపై నిర్మాత రవీందర్‌ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

వనితా, పీటర్ పాల్‌ని వివాహం చేసుకొని మొదటి భార్య, వారి పిల్లలకు అన్యాయం చేశారని ఆయన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన వనితా.. తన పెళ్లి విషయంలో రవీందర్‌ జోక్యం అవసరం లేదని, వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. దీనిపై మరోసారి రవీందర్ మాట్లాడుతూ.. ఆమెకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఎలాంటి లీగల్ కేసునైనా ఎదుర్కొంటా. నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పలేదు అని క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ నుంచి వనిత అంటే తనకు గౌరవమని.. ఆమెకు తాను పెద్ద అభిమానిని అని అన్నారు. ఆమె పెళ్లి విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు వాస్తవమే. అయినా వాటిని తప్పు పట్టడానికి వీలు లేదు అని రవీందర్‌ చెప్పుకొచ్చారు.