
సూపర్‌స్టార్ మహేష్ బాబుకు మహర్షితో మంచి విజయాన్ని ఇచ్చారు వంశీ పైడిపల్లి. ఇక ఈ కాంబోలో మరో మూవీ కూడా కన్ఫర్మ్ అయ్యింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్లలో భాగంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నానని మహేష్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఏమైందో తెలీదు కానీ ఈ సినిమా ఆగిపోయిందన్న వార్తలు వచ్చాయి. మరోవైపు ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో నటిచేందుకు సూపర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. దీంతో వంశీ- మహేష్ మూవీ అటకెక్కిందని టాక్ నడిచింది. ఈ రూమర్లపై అటు మహేష్ గానీ.. ఇటు వంశీ గానీ స్పందించకపోవడంతో ఇదే నిజమని అందరూ భావించారు.
కాగా ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో వంశీ పైడిపల్లి క్లారిటీ ఇచ్చారు. ”మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంది. కన్ఫర్మ్ అయిన తరువాత ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు చెబుతా. మా కాంబోపై అభిమానులకు ఎంత ఆసక్తి ఉందో.. అంతకంటే ఎక్కువ ఆసక్తి నాకు కూడా ఉంది” అని వంశీ అన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే.. కాస్త లేటు అయినా ఈ కాంబోలో సినిమా కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇక మహేష్ ఫ్యామిలీతో రిలేషన్ గురించి మాట్లాడుతూ.. ”కొన్ని సంబంధాలు ఎలా కలుస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని బంధాల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. మహేష్ ఫ్యామిలీతో నాకు మంచి సత్సంబంధాలు” ఉన్నాయి అని అన్నారు. ఇక కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని.. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే ఆయనతో తనకు స్నేహం ఉందని, కేటీఆర్‌ను అన్నయ్య అని పిలుస్తానని వివరించారు. అలాగే వర్షం సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసినప్పటి నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు.
Read This Story also: గంగమ్మ నగలతో దొంగ రుణాలు.. కుప్పంలో స్కామ్