Akhanda Movie: ఎల్లలు దాటిన అభిమానం.. డల్లాస్‌ను మోత మోగించిన బాలయ్య ఫ్యాన్స్..

| Edited By: Surya Kala

Dec 02, 2021 | 1:53 PM

అఖండ డమరుక నాదం రాష్ట్రం, దేశం, ఖండాలు దాటి.. డల్లాస్‌కు తాకింది.! బాలయ్య ఆగ్రహావేశం అక్కడ థియేటర్లను ఊపేస్తోంది.

Akhanda Movie: ఎల్లలు దాటిన అభిమానం.. డల్లాస్‌ను మోత మోగించిన బాలయ్య ఫ్యాన్స్..
Akhanda Movie Dallas
Follow us on

Balakrishna Fans Crazy: అఖండ డమరుక నాదం రాష్ట్రం, దేశం, ఖండాలు దాటి.. డల్లాస్‌కు తాకింది.! బాలయ్య ఆగ్రహావేశం అక్కడ థియేటర్లను ఊపేస్తోంది. ఇక నిగ్రహంతో ఉండలేమయ్యా బాలయ్య అంటూ.. థియేటర్ల ముందే అభిమానులను ఊగిపోయేలా చేస్తోంది. అమెరిక్లను కూడా ఆకట్టుకుంటూ.. బాలయ్య క్రేజ్‌ తెల్లోల్లను ముక్క మీద వేలేసేలా చేస్తుంది. తెలుగు సినిమా పవర్‌ను.. స్టామినాను మరో సారి చూపించేస్తోంది.

మోస్ట్ అవేటెడ్ మూవీగా బోయపాటి డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా అఖండ. ఎన్నో అంచనాల మధ్య తాజాగా రిలీజైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికా రాష్ట్రాల్లోనూ బ్రహ్మాండంగా ఆడుతోంది. జై బాలయ్య అరుపులతో.. థియేటర్లు మార్మోగిపోయాలా చేస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అఖండ సినిమా బెనిఫిట్ షో భారీ స్పందన లభించింది. అర్ధరాత్రి నుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్ద సందడి చేశారు. నందమూరి అభిమానులు జై బాలయ్య అంటూ నినాదించారు.

మరోవైపు, ఇప్పటికే బెన్‌ ఫిట్‌ షోతో థియేటర్ల ముందు హంగామా చేసిన బాలయ్య అభిమానులు… అటు అమెరికా డల్లాస్‌లో కూడా అదే చేశారు. బాలయ్య కటౌట్లతో..పోస్టర్లతో… జెండాలతో ర్యాలీ నిర్వహించారు. జై బాలయ్య అంటూ డల్లాస్‌ వీధుల్లో మాస్‌ జాతర క్రియేట్ చేశారు. తెలుగోడు ఉన్న చోటళ్లా బాలయ్యా రీసౌండ్‌ చేస్తూనే ఉంటాడని మరో సారి నిరూపించారు.భారీ ఎత్తున కారు ర్యాలీ నిర్వహించి బాలయ్యకు తమ అభిమానం చాటుకున్నారు.

Akhanda

అఖండ చిత్రం విడుదల సందర్భంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు USA బాలయ్య బాబు మాస్ ఫాన్స్.


ఇక సినిమా విషయానికి వస్తే… అఖండ మూవీలో నందమూరి బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించింది. తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. ఇక బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌లో రెండు సినిమాలు హిట్టవ్వడం, ‘అఖండ’ మూడో సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా వున్నట్లు టాక్ బయటకువచ్చింది.

ఇదిలావుంటే, రోజుకు నాలుగు షోలకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చినా ఉదయం 6గంటలకు, 9 గంటలకు అఖండ షోలు ప్రదర్శించారు. స్వచ్ఛంద సంస్థల పేరుతో పోస్టర్స్ ముద్రించి ప్రచారం చేసి మరీ అధిక రేట్లకు టిక్కెట్స్ అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిస్తున్నాయి.