
మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. లెక్కల మాష్టార్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా ఒక్కో పాటను విడుదల చేయబోతోంది. ఈ క్రమంలో ‘నీ కన్ను నీలి సముద్రం’ అంటూ సాగే మొదటి పాట మార్చి 2న సాయంత్రం గం.4.05ని.లకు విడుదల అవ్వనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక ప్రేమ కథాంశంగా తెరకెక్కిన ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌కు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ప్రేమ పాటలను ఇవ్వడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న డీఎస్పీ.. ‘ఉప్పెన’కు అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారని తెలుస్తోంది. ఏదేమైనా దేవీ ఇచ్చిన సంగీత ఉప్పెనలో మునిగి తేలాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.
On d Occasion of d BIRTHDAY of my GURU..
MAESTRO
Sri.Mandolin.U.SHREENIVAS ANNAWith his Blessings
We r announcing d 1st SONG WAVE of #UPPENA to hit ur Hearts on MARCH 2nd @ 4:05PM
Hope U’l love it ??#NeeKannuNeeliSamudram #PanjaVaisshnavTej @IamKrithiShetty #BuchiBabuSana pic.twitter.com/umbRKnhCqo
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 28, 2020