ఉపేంద్ర ‘ఐ లవ్ యు’ మూవీ రివ్యూ!

| Edited By: Pardhasaradhi Peri

Jun 14, 2019 | 4:22 PM

టైటిల్ : ‘ఐ లవ్ యు’ తారాగణం : ఉపేంద్ర, రచితా రామ్, సోనూ గౌడ, బ్రహ్మానందం తదితరులు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆర్ చంద్రు విడుదల తేదీ: 14-06-2019 కన్నడ హీరో ఉపేంద్ర, హీరోయిన్ రచితా రామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్. చంద్రు తెరకెక్కించిన కన్నడ, తెలుగు బైలింగ్యువల్ చిత్రం ‘ఐ లవ్ యు’. ‘బ్రహ్మ’ సినిమా తర్వాత ఉపేంద్ర, చంద్రు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంపై శాండల్‌వుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. […]

ఉపేంద్ర ఐ లవ్ యు మూవీ రివ్యూ!
Follow us on

టైటిల్ : ‘ఐ లవ్ యు’

తారాగణం : ఉపేంద్ర, రచితా రామ్, సోనూ గౌడ, బ్రహ్మానందం తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆర్ చంద్రు

విడుదల తేదీ: 14-06-2019

కన్నడ హీరో ఉపేంద్ర, హీరోయిన్ రచితా రామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్. చంద్రు తెరకెక్కించిన కన్నడ, తెలుగు బైలింగ్యువల్ చిత్రం ‘ఐ లవ్ యు’. ‘బ్రహ్మ’ సినిమా తర్వాత ఉపేంద్ర, చంద్రు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంపై శాండల్‌వుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో ఇప్పుడు చూద్దాం.

కథ‌ :

అత్యంత ధనవంతుడైన సంతోష్(ఉపేంద్ర) తన తండ్రి చివరి కోరిక మేరకు గౌరీ(సోనూ గౌడ)ను పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓ పాప పుడుతుంది. అయితే సంతోష్‌కు ఈ పెళ్లి ఇష్టం ఉండదు. కాలేజీ రోజుల్లో అతను ప్రేమించిన ధార్మిక(రచితా రామ్)ను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. ఇకపోతే సంతోష్‌కు చాలా ఏళ్ళ తర్వాత ధార్మికను కలుసుకునే అవకాశం వస్తుంది. ఆ కలయిక తర్వాత సంతోష్ జీవితం ఏవిధంగా మలుపు తిరిగింది.? అసలు ఎందుకు ధార్మిక.. సంతోష్‌ను కలుసుకుంది..? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు :

సినిమాకి ప్రధాన బలం హీరో ఉపేంద్ర. తనదైన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడు. కథను మలుపు తిప్పే పాత్రలో హీరోయిన్ రచితా రామ్ అద్భుతంగా నటించింది. మరో నటి సోను గౌడ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. బ్రహ్మానందం కామెడీ పెద్దగా పండలేదని చెప్పాలి. వీరు తప్ప చెప్పుకోదగ్గ పాత్రలు సినిమాలో ఏమీలేవు.

విశ్లేష‌ణ‌ :

దర్శకుడు ఆర్ చంద్రు అంటే లవ్ స్టోరీస్‌కు పెట్టింది పేరు. ఇక ఈ సినిమాను కూడా ఆయన పూర్తి ఎంటర్టైనర్‌గా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ బోర్ కొట్టించినా.. మిగిలిన సినిమా మొత్తం బాగుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయి.

సాంకేతిక విభాగాల పనితీరు:

దర్శకుడు ఆర్ చంద్రు.. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏమి చెప్పాలనుకున్నాడో అది క్లియర్‌గా స్క్రీన్ మీద ఎలివేట్ చేశాడు. ఇక  మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపించాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

హీరో హీరోయిన్ల పెర్ఫార్మన్స్

కథ – స్క్రీన్ ప్లే

మైనస్‌ పాయింట్స్‌ :

కొన్ని సాగదీత సీన్స్