
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఆదర్శ కుటుంబం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, శ్రీనిధి జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి క్యూరియాసిటినీ కలిగించాయి. ఇటీవల హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అత్యంత వైభవంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ కు గౌరవంగా కాళ్లకు నమస్కరించింది. వెంటనే త్రివిక్రమ్ సైతం సరదాగా ఆమె పాదాలకు నమస్కరించేందుకు కిందకు వంగాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
వెంటనే తేరుకున్న శ్రీనిధి శెట్టి ఆయనను ఆపి, గౌరవసూచకంగా తిరిగి త్రివిక్రమ్ కాళ్లకు నమస్కరించారు. ఈ క్యూట్ అండ్ ఫన్నీ మూమెంట్ అక్కడ ఉన్న అందరినీ ఆకట్టుకోగా.. స్టేజ్ మీద యాంకర్ సుమ కూడా దీనిపై సరదాగా స్పందించడంతో ఆ ప్రాంతంలో నవ్వులు విరబూశాయి. అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఇదే ప్రశ్న ఎదురైంది.
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
తాజాగా ఈ సంఘటనపై త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా స్పష్టత ఇచ్చారు. “ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా బాగుంది. బట్ కాకపోతే మీరు శ్రీనిధి శెట్టి గారు లోపలికి రాగానే ఏదో కాళ్ళకి దండం పెట్టే ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు, ఏంజరిగింది అక్కడ? మాకు కనిపించింది అదే లేకపోతే చేసిందే అదా?” అనే ప్రశ్నకు త్రివిక్రమ్ సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ, “తను చాలా యాక్చువల్ గా చెప్పాలంటే ఆ మోస్ట్ ఫ్రెండ్లీ. నేను ఇప్పటి దాకా పని చేసిన హీరోయిన్స్ లో అండ్ నేను మామూలుగా అందరితోటి కొంచెం ఫ్రెండ్లీ గానే ఉంటాను. తను ఇంకా అసల మాతో యాక్చువల్ గా నిజంగానే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయింది. సో ఏదో సరదాగా తనతో కామెడీ చేసే ప్రయత్నం” అని వివరించారు. ఈ వ్యాఖ్యల ద్వారా, త్రివిక్రమ్ శ్రీనిధి శెట్టి పట్ల ఉన్న గౌరవపూర్వకమైన, స్నేహపూర్వకమైన వైఖరిని తెలియజేశారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..