త్రిష ఎందుకు తప్పుకుందో అసలు కారణం చెప్పిన చిరు..!

| Edited By:

Apr 09, 2020 | 11:41 AM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' నుంచి చెన్నై చిన్నది త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన త్రిష..

త్రిష ఎందుకు తప్పుకుందో అసలు కారణం చెప్పిన చిరు..!
Follow us on

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’ నుంచి చెన్నై చిన్నది త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన త్రిష.. క్రియేటివ్ డిఫరెన్స్‌ల వలన ఆచార్య నుంచి తాను తప్పుకుంటున్నానని తెలిపింది. అయితే మరికొన్ని రోజుల్లో షూటింగ్ ఉందన్న సమయంలో సడన్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవడం యూనిట్‌కు కాస్త ఇబ్బందిగా మారింది. దీనిపై పలు రకాల పుకార్లు కూడా వినిపించాయి. కానీ అదే సమయంలో ఈ ప్రాజెక్ట్‌కు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. టీమ్‌తో పాటు ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి త్రిష తప్పుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ”ఈ ప్రాజెక్ట్ నుంచి త్రిష తప్పుకుందని తెలిశాక నేను షాక్‌కు గురయ్యా. త్రిష ఏమైనా ఇబ్బందికి గురైందా..? అని మూవీ యూనిట్‌ని అడిగి తెలుసుకున్నా. త్రిష కోసం నా కుమార్తె సుష్మిత ఔట్‌ఫిట్లను కూడా సిద్ధం చేసింది. అయితే ఆ తరువాత నాకు తెలిసిన విషయం ఏంటంటే. మణిరత్నం సినిమాను ఒప్పుకున్న త్రిష.. ఆ ప్రాజెక్ట్‌కు చాలా రోజులను కేటాయించింది. అందుకే ఆమె నా చిత్రం నుంచి తప్పుకుంది. మా టీమ్‌తో ఎవరికీ త్రిషతో ఎలాంటి ఇబ్బంది లేదు” అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. కాగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో చెర్రీ నటించనున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కుదిరితే దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Read This Story Also: ఆ క్రికెటర్ తీరుతో ఇబ్బంది పడ్డా: ప్రియమణి