Tollywood: ఎన్నాళ్లు సహించాలి.. ‘అసహ్యం వేస్తోంది’ అంటూ కోపంతో ఊగిపోయిన స్టార్ హీరోయిన్!

సౌత్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఓ సీనియర్ నటి ఇటీవల ఫేక్ న్యూస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్నేహితులతో ఉన్న ఫోటోలు చూసి పెళ్లి వార్తలు రాయడం, ఎవరో ఒకరిని నా భర్తగా ప్రకటించడం… ఇది ఇక భరించలేని ..

Tollywood: ఎన్నాళ్లు సహించాలి.. ‘అసహ్యం వేస్తోంది’ అంటూ కోపంతో ఊగిపోయిన స్టార్ హీరోయిన్!
Thrisha

Updated on: Nov 18, 2025 | 10:56 PM

సౌత్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఓ సీనియర్ నటి ఇటీవల ఫేక్ న్యూస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్నేహితులతో ఉన్న ఫోటోలు చూసి పెళ్లి వార్తలు రాయడం, ఎవరో ఒకరిని నా భర్తగా ప్రకటించడం… ఇది ఇక భరించలేని స్థాయికి చేరింది. దయచేసి ఈ ఫేక్ న్యూస్ ప్రచారం ఆపండి!’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్-కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

పదేళ్లుగా రూమర్స్..

41 ఏళ్ల వయసులోనూ యూత్‌ఫుల్ గ్లోతో, లియో, పొన్నియిన్ సెల్వన్, థగ్ లైఫ్, విశ్వంభర వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న త్రిష.. వ్యక్తిగత జీవితంలో మాత్రం గత పదేళ్లుగా పెళ్లి రూమర్స్‌తో ఇబ్బంది పడుతోంది. 2015లో వరుణ్ మానియన్‌తో ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయిన తర్వాత నుంచి ఆమె పేరు ప్రతి రెండేళ్లకోసారి ఏదో ఒక బిజినెస్‌మ్యాన్‌తోటో, స్టార్ హీరోతోటో ముడిపడుతూనే ఉంది.

ఇటీవల చండీగఢ్ బిజినెస్‌మ్యాన్‌తో ‘పెళ్లి ఫిక్స్ అయింది, హనీమూన్ షెడ్యూల్ కూడా సెట్ చేశారట’ అనే వార్తలు వచ్చాయి. దీనికి తోడు తలపతి విజయ్‌తో ఉన్న స్నేహాన్ని కూడా ‘సీక్రెట్ రిలేషన్’గా మార్చేశారు. దాంతో త్రిష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 ఏళ్లకు పైగా 60కి పైగా చిత్రాల్లో నటించి కెరీర్లో టాప్లో ఉన్న త్రిష పర్సనల్ లైఫ్లో మాత్రం తరుచూ రూమర్స్ బారినపడుతోంది.

విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష పోస్ట్ చేసిన ఒకే ఒక్క ప్రైవేట్ ఫోటో.. విజయ్ ఆమె కుక్కపిల్ల ‘ఇజ్జీ’తో ఆడుకుంటూ, పక్కన నవ్వుతున్న త్రిష సోషల్ మీడియాలో రాకెట్ స్పీడ్‌లో వైరల్ అయింది. ‘ఇద్దరూ కలిసి ఉంటున్నారా? విజయ్-సంగీత డైవర్స్‌కి ఇదే కారణమా?’ అంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. వరుస రూమర్స్తో విసుగెత్తిన త్రిష ‘స్నేహితులు, కో-స్టార్స్‌తో ఉన్న ఫోటోలు చూసి నా భర్తలుగా మార్చడం ఆపండి.

ఇది నా పర్సనల్ స్పేస్‌లో జోక్యం చేసుకోవడం మాత్రమే కాదు, హ్యారస్‌మెంట్ కూడా!’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘నేను సింగిల్‌గా సంతోషంగా ఉన్నాను. పెళ్లి జరిగితే మీకంటే ముందు నేనే చెప్తాను’ అని గతంలోనూ పలుసార్లు చెప్పిన త్రిష ఇప్పుడు మాత్రం ఫేక్ న్యూస్ మేకర్స్కి లీగల్ నోటీసులు కూడా ఇచ్చేందుకు సిద్ధపడుతోందట. ప్రస్తుతం త్రిష కెరీర్ పీక్‌లో ఉంది. చిరంజీవితో ‘విశ్వంభర’, రజనీకాంత్‌తో ‘వారియం’ సినిమాలతో బిజీగా ఉంది. ‘నా లైఫ్ గురించి కాదు, నా పని గురించి మాట్లాడండి’ అంటోంది త్రిష. ఇకనైనా ఆమెపై రూమర్స్ ఆగుతాయో చూడాలి మరి!

Follow Us