తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగిన త్రిష ప్రస్తుతం ఆశించినంత ఆఫర్లను అందుకోలేకపోతుంది. ఇటీవల 96 సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాతో తమిళ్ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ప్రస్తుతం త్రిష రాంగి, షుగర్, రామ్, పరమపాదం విలయాట్టు, గర్జనై, శతురంగ వెట్టై 2 అనే సినిమాల్లో నటించనుంది. ఇక వీటితోపాటు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘పొన్నియన్ సెల్వన్’లో కూడా కీలక పాత్రలో నటిస్తుంది త్రిష.
ఇటీవలే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్న త్రిష కూడా వీలైనంత తొందర్లో ఈ మూవీ షూటింగ్లో జాయిన్ కావాల్సింది ఉంది. దీంతో ఆమె ప్రస్తుతం చేస్తున్న ‘రాంగి’ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రాన్ని ఎమ్. శరవణన్ తెరకెక్కిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.