Hazel Keech: శభాష్.. క్యాన్సర్‌ రోగుల కోసం అందరూ మెచ్చే పని చేసిన యువరాజ్‌ సింగ్ భార్య..

|

Oct 16, 2023 | 5:36 PM

సాధారణంగా ఆడవారి అందాన్ని రెట్టింపు చేయడంలో కురులు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే తమ శిరోజాల సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు మహిళలు. కురులు రాలిపోకుండా రకరకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు. అయితే ఇటీవల కొంతమంది మహిళలు తమ అందమైన కురులు క్యాన్సర్‌ రోగుల కోసం దానం చేసి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య, ప్రముఖ నటి హాజెల్ కీచ్ తన శిరోజాలను క్యాన్సర్‌ రోగులకు దానం చేసింది

Hazel Keech: శభాష్.. క్యాన్సర్‌ రోగుల కోసం అందరూ మెచ్చే పని చేసిన యువరాజ్‌ సింగ్ భార్య..
Yuvraj Singh, Hazel Keech
Follow us on

సాధారణంగా ఆడవారి అందాన్ని రెట్టింపు చేయడంలో కురులు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే తమ శిరోజాల సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు మహిళలు. కురులు రాలిపోకుండా రకరకాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు. అయితే ఇటీవల కొంతమంది మహిళలు తమ అందమైన కురులు క్యాన్సర్‌ రోగుల కోసం దానం చేసి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య, ప్రముఖ నటి హాజెల్ కీచ్ తన శిరోజాలను క్యాన్సర్‌ రోగులకు దానం చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. జుట్టు కత్తిరించుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఆమె తాను ఎందుకు అలా చేయాలనుకున్నానో అందులో వివరించింది. ప్రస్తుతం హెజెల్‌ కీచ్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరలవుతోంది. యువరాజ్‌ సింగ్, నటి హెజెల్‌ కీచ్‌ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ దాంపత్య బంధానికి గుర్తింపుగా 2022 జనవరి 25న ఓరియోన్‌ అనే పండంటి బిడ్డ వీరి జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇక ఈ ఏడాది ఆగస్టులో హెజెల్‌ కీచ్‌కు ఔరా అనే ఆడబిడ్డను ప్రసవించింది. కాగా ప్రసవానంతర జుట్టు రాలడం చాలా సాధారణం. చికిత్సతో దీనికి కట్టడి చేసే బదులు హెజెల్ తన జుట్టును చిన్నదిగా కత్తిరించుకోవాలని నిర్ణయించుకుంది. అందుఉకోసం క్యాన్సర్ రోగులకు విగ్గులు తయారు చేయడానికి ఆమె తన జుట్టును దానం చేసింది.

‘బిడ్డను ప్రసవించిన తర్వాత చాలా మంది మహిళలు తమ జుట్టును చిన్నగా కత్తిరించుకుంటారని నేను ఇంతకు ముందు గ్రహించలేదు. డెలివరీ తర్వాత నేను దీన్ని అర్థం చేసుకున్నాను. అందుకే జుట్టు చిన్నగా కత్తిరించుకోవాలని నిర్ణయించుకుని క్యాన్సర్ పేషెంట్లకు దానం చేశాను. ఈ నిర్ణయం తీసుకోవడంలో నా భర్త యువరాజ్‌ సింగ్‌ నుంచి నేను ప్రేరణ పొందాను. యువరాజ్ సింగ్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ ట్రీట్‌మెంట్ సమయంలో జుట్టు రాలడం వల్ల కలిగే బాధని అనుభవించారు. ఇప్పుడు ఆ బాధను అర్థం చేసుకునే నా కురులను దానం చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లిటిల్ ప్రిన్సెస్ ట్రస్ట్‌కి నా జుట్టును దానం చేశాను. ‘నా జుట్టును అంగీకరించినందుకు @officiallittleprincesstrust ధన్యవాదాలు. దయచేసి గమనించండి, ఇది ఏ రకమైన చెల్లింపు ప్రమోషన్ కాదు. ఈ స్వచ్ఛంద సంస్థతో నాకు ఎలాంటి సంబంధం లేదు, పరిచయం లేదు. నేను గూగుల్ లో విగ్ కోసం హెయిర్ డొనేషన్ కోసం సెర్చ్ చేసినప్పుడు, నాకు ఈ ఛారిటీ సంస్థ వివరాలు లభించాయి’ అని హెజెల్‌ చెప్పుకొచ్చింది. కాగా యువరాజ్‌సింగ్‌తో పెళ్లికి ముందు పలు హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది హెజెల్‌ కీచ్‌. తెలుగులో రవితేజ కిక్‌, రానా దగ్గుబాటి కృష్ణం వందే జగద్గురుమ్‌ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో ఆమె ఆడిపాడింది. ఇక బిల్లా (తమిళ్‌), బాడీగార్డ్‌ (హిందీ), హీర్‌ అండ్‌ హీరో, తదితర సినిమాల్లో స్పెషల్ రోల్స్‌ పోషించింది. హిందీ బిగ్‌బాస్‌లోనూ పాల్గొంది.

ఇవి కూడా చదవండి

నా భర్త నుంచి ప్రేరణ పొందాను..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..